పోలీసులకు దర్శకుడు వర్మ సలహా...

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు... ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ఎంతో సహనంగా వ్యవహరిస్తున్నారు.

news18-telugu
Updated: March 26, 2020, 3:55 PM IST
పోలీసులకు దర్శకుడు వర్మ సలహా...
రామ్ గోపాల్ వర్మ (Twitter/Photo)
  • Share this:
కరోనా వ్యాప్తిని అమలు చేసేందుకు లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటే కుదరదని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. పోలీసులు అలాంటి వైఖరితో ఉండొద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన కోరారు. అలా చేస్తే ప్రజలు పోలీసుల నెత్తిన ఎక్కి కూర్చుంటారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను బయటకు రావొద్దంటూ దండం పెడుతూ, కన్నీళ్లు పెట్టుకున్న ఓ ట్రాఫిక్ పోలీస్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వర్మ... ఈ వ్యాఖ్యలు చేశారు.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు... ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ఎంతో సహనంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రజలు తమ మాట వినడం లేదని భావిస్తున్న రక్షకభటలు తమ లాఠీలకు కూడా పని చెబుతున్నారు. అయితే తన నిత్యావసర వస్తువుల కొనుగోలు సహా అత్యవసరాల కోసం బయటకు వస్తున్న ప్రజలను కన్విన్స్ చేయడానికి పోలీసులు కాస్త ఎక్కువగా శ్రమిస్తున్నారని చెప్పాలి.First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు