అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే వెరైటీ శిక్ష.. మళ్లీ ఆ తప్పు చేయరు

ఇండోనేషియా ప్రభుత్వం మాస్కులు పెట్టుకోకుండా బయటకు వచ్చే వారికి వింత శిక్షను విధించింది.

news18-telugu
Updated: September 15, 2020, 2:24 PM IST
అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే వెరైటీ శిక్ష.. మళ్లీ ఆ తప్పు చేయరు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా భయం ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించే బయటకు రావాలని ప్రపంచ దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ కొంత మంది ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇలాంటి వారికి ఒక్కోదేశం ఒక్కోరకమైన శిక్ష విధిస్తోంది. తాజాగా ఇండోనేషియా ప్రభుత్వం మాస్కులు పెట్టుకోకుండా బయటకు వచ్చే వారికి వింత శిక్షను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకుండా తిరిగేవారిని శ్మశానాల్లో శవాలను పూడ్చిపెట్టేందుకు సమాధులు తవ్వాలని ఆదేశించింది. తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో ఎనిమిది మందికి ఇలాంటి శిక్ష విధించారు.

కోవిడ్ -19తో మరణించినవారికి సమాధులు తవ్వాలని న్గాబెటన్ గ్రామానికి చెందిన ఎనిమిది మందికి ఈ శిక్ష విధిస్తున్నట్టు సెర్మే జిల్లా అధికారి సుయోనో చెప్పారు. ప్రస్తుతం సమాధులు తవ్వేందుకు ముగ్గురు వ్యక్తులే అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు. అందుకే వారితో కలిసి పనిచేయాలని శిక్ష పడిన వ్యక్తులను ఆదేశించామని సుయోనో వివరించారు. ఒక్కో సమాధి తవ్వేందుకు సుయోనో ఇద్దరు వ్యక్తులను కేటాయించాడు. వారిలో ఒకరు గుంట తవ్వాలని, మరొకరు శవాన్ని ఉంచే చెక్క పెట్టెకు సంబంధించిన పనులు చేయాల్సిందిగా చెప్పారు. ఈ చర్య ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించేవారికి హెచ్చరికలా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి శిక్షల ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించొచ్చని ఆయన ఓ వార్తాసంస్థకు వివరించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా సెర్మే జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని, అందుకే గ్రామాల్లో గస్తీ నిర్వహించి, ఇలాంటి వారిని శిక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అక్కడి చట్టాల ప్రకారం... ప్రోటోకాల్లను ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా చెల్లించాలి. లేదా సమాజ సేవ చేయాలి. సెర్మే పోలీస్ చీఫ్ ఈ ఘటనపై స్పందించారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నియమ నిబందనలను ప్రజలు పాటించేలా చేయడానికి మిలటరీతో పాటు పోలీసులు కూడా సహరిస్తారని ఆయన చెప్పారు. బయటకు వచ్చేవారు అందరూ ఫేస్ మాస్క్లు ధరించాలని ఆయన ప్రజలను కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: September 15, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading