మాస్క్ పెట్టుకోమనడం తప్పా?... మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి

ఓవైపు కరోనా ఎంతలా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సింది పోయి... అలా పెట్టుకోమని చెప్పిన మహిళా ఉద్యోగిపై దాడి చేయడం సమంజసమా?

news18-telugu
Updated: June 30, 2020, 2:04 PM IST
మాస్క్ పెట్టుకోమనడం తప్పా?... మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి
నిందితుణ్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
  • Share this:
ఆంధ్రప్రదేశ్... నెల్లూరులో జరిగిన ఘటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నెల్లూరులోని టూరిజం ఆఫీసులో డిప్యూటీ మేనేజర్ భాస్కర్.... కాంట్రాక్ట్ ఉద్యోగిని అయిన ఉషారాణిని రాడ్డుతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఎందుకంటే... ఒకటే కారణం... ఆయన్ని ముఖానికి మాస్కు పెట్టుకోమని చెప్పింది. అంతే... నాకే చెబుతావా... అంటూ... నీ సంగతి చూస్తా... అంటూ... రాడ్డుతో కొట్టాడు. ఎంత దారుణమంటే... అసలే ఆమె దివ్యాంగురాలు. ఏ మాత్రం జాలి చూపకుండా... అలా కొట్టేసరికి గాయాలపాలైన ఆమె... బాధపడుతూనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. జరిగింది చెప్పి కన్నీరు పెట్టింది.

"నన్ను మాస్కు ధరించాలని కోరుతావా అని అరుస్తూ భాస్కర్... తన టేబుల్ దగ్గరకు వచ్చి తనను పిడిగుద్దులు గుద్దాడనీ... అంతేకాకుండా... తనను కుర్చీ నుంచీ కింద పడేసి రాడ్డుతో విపరీతంగా కొట్టాడని" చెప్పి కన్నీరు పెట్టింది. ఇదంతా విన్న పోలీసులకు మనలాగే భాస్కర్‌పై కోపం వచ్చింది. చట్టప్రకారం కంప్లైంట్ రాసి... వెంటనే వెళ్లి... అతని కోసం వెళ్లి, అరెస్టు చేశారు నెల్లూరు నాలుగో టౌన్ పోలీసులు.


నిజానికి ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఉషారాణిపై దాడిని తోటి ఉద్యోగులు అడ్డుకోబోయారు. భాస్కరో తోసేయడంతో ఓ ఉద్యోగి కిందపడిపోయాడు. మరో ఉద్యోగి భాస్కర్ చేతిలోని రాడ్డును అతి కష్టమ్మీద లాక్కున్నాడు. ఉషారాణిపై భాస్కర్ దాడి చేయడాన్ని కళ్లతో చూడలేక ఓ మహిళా ఉద్యోగి అక్కడి నుంచి భయంతో పరుగులు తీసింది.

ఆ భాస్కర్.. కొంతకాలంగా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినులపై వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
First published: June 30, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading