Home /News /coronavirus-latest-news /

DELTA VARIANT TENSION ONE DAY 50000 CASES IN UNITED KINGDOM AND KARNATAKA ALSO AFRAID NGS

Delta Variant: మళ్లీ భయపెడుతున్న డెల్టా వేరియంట్‌ AY4.2.. ఒక్క రోజే 52 వేలకుపైగా కేసులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New Variant Tension: కరోనా వైరస్ భయం ఇంకా వీడడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్నాయి. రెండేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాల్లో ప్రజలను వణికిస్తోంది.

ఇంకా చదవండి ...
    Delta Variant AY4.2: ప్రపంచ దేశాలను మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) భయపెడుతోంది. రెండేళ్ళ క్రితం చైనా (China)లో పుట్టిన కరోనా వైరస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ విస్తరిస్తోంది. రకరకాల రూపాలను సంతరించుకుని ప్రజలను భయ పెడుతోంది. తాజాగా కరోనా వైరస్‌ కొత్తరకం వేరియెంట్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియెంట్‌ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ఇప్పుడు డేంజర్ బెల్ గా మారింది. రెండేళ్లుగా కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డెల్టా వేరియెంట్‌ ( Delta Variant ) తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన ఏవై. 4.2 కరోనా కేసులు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను (United Kingdom) వణికిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా ఈ కొత్త రకం వేరియెంట్‌ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియెంట్‌లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరు మాత్రం ఆందోళన కలిగించేలా ఉంది. ఈ వేరియెంట్‌ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మ్యుటేషన్లు అయిన ఏ 222వీ, వై 145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్‌ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    బ్రిటన్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గతవారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అక్టోబరు 21న ఒక్క రోజే 52 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది.

    యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా లండన్‌ జెనెటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఫ్రాంకోయిస్‌ బల్లాక్స్‌ వెల్లడించారు. ఇక రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోద వుతుండటంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులు నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది.

    ఇదీ చదవండి: టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫైనల్ చేసేది వారే అంటూ క్లారిటీ

    యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో, అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ ప్రజల ను కోరారు. మాస్క్‌ ధరించకపో వడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్‌ చేయాలని యోచిస్తోంది. రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈనెల 28 నుంచి మూసి వేయనున్నట్లు తెలిపారు.

    ఇదీ చదవండి: వార్నర్ మెరుపు ఇన్నింగ్స్.. వరుస విజయాలతో ఆసీస్ జోష్.. శ్రీలంకపై ఘన విజయం

    యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 భారత్‌ను కూడా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూర్ ను భయపెడుతోంది. ఇప్పటివరకూ Delta AY.4.2 కేసులు ఏడు నమోదైనట్లు కర్నాటక రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు. ఇందులో మూడు కేసులు బెంగళూరులో నమోదు కాగా, మరో నాలుగు కేసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదయినట్లు ఆయన తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Coroana cases, Corona alert, Corona effect, Delta Variant, World news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు