Delhi: యమా డేంజర్‌లో ఢిల్లీ.. గంటకు 12 కరోనా మరణాలు.. ఒకరి నుంచి తొమ్మిది మందికి సోకుతున్న వైరస్..!

Delhi: యమా డేంజర్‌లో ఢిల్లీ.. గంటకు 12 కరోనా మరణాలు.. ఒకరి నుంచి తొమ్మిది మందికి సోకుతున్న వైరస్..!

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 22,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 94,592. ఇన్‌ఫెక్షన్ రేట్ 30.21 శాతంగా ఉంది. ఢిల్లీలో కరోనా బాధితులను...

  • Share this:
    న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోన కరాళా నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆక్సిజన్ కొరత దేశ రాజధానిలో కరోనా బాధితులకు శాపంగా మారింది. గత సోమవారం ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు ఐదుగురు చనిపోతే.. ఈ సంఖ్య ప్రస్తుతం 12కి చేరింది. ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు 12 మంది చనిపోతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 24 వరకూ 1,777 మంది కరోనా సోకి.. పరిస్థితి విషమించి చనిపోయారు. అంతేకాదు.. గతేడాదితో పోలిస్తే కరోనా వ్యాప్తి కూడా ఈసారి మరింత తీవ్రంగా ఉందని ఎయిమ్స్ డాక్టర్లు తేల్చారు. గతేడాది కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి నలుగురికి సోకే పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి తొమ్మిది మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 19న 240 కరోనా మరణాలు నమోదైతే.. ఏప్రిల్ 20న 277 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 357 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 357 మరణాలంటే.. గంటకు 15 మంది కరోనా కారణంగా చనిపోతున్నారు. అంతేకాదు.. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు కూడా ఢిల్లీ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 22,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 94,592. ఇన్‌ఫెక్షన్ రేట్ 30.21 శాతంగా ఉంది. ఢిల్లీలో కరోనా బాధితులను వెంటాడుతున్న ఈ తరుణంలో అక్కడి ప్రజలకు కాస్తంత ఊరట కలిగించే కబురందింది.

    అమెరికా నుంచి 300 ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్స్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఢిల్లీకి చేరుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.

    ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంతలా ఉందంటే.. స్వయంగా ముఖ్యమంత్రే ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నామని, సాయం చేయాలని వ్యాపారవేత్తలకు లేఖ రాసిన పరిస్థితి. ఢిల్లీలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానాల్లో చోటు చాలక పచ్చని పార్కులను, ఖాళీ ప్రదేశాలను అంతిమ సంస్కారాలకు అనువైన ప్రదేశాలుగా మారుస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: