విద్యార్థికి హైకోర్టు షాక్.. కోర్టు ఫీజు కట్టలేదని కరోనా పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రతీకాత్మక చిత్రం

ఐసోలేషన్​ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని, అపరిశుభ్రంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్​ దాఖలు చేశారు. అయితే, సదరు విద్యార్థి కోర్టు ఫీజు చెల్లించకపోవడంతో విచారణ వాయిదా వేసింది.

  • Share this:
కోర్టు ఫీజు చెల్లించని కారణంగా ఓ ప్రజా ప్రయోజన వాజ్యాంపై విచారణను వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థినికి కరోనా సోకి సుల్తాన్​పురి ఐసోలేషన్​ కేంద్రంలో హోమ్​ క్వారంటైన్​లో ఉంటుంది. అయితే, ఐసోలేషన్​ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని, అపరిశుభ్రంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్​ దాఖలు చేశారు. అయితే, సదరు విద్యార్థి కోర్టు ఫీజు చెల్లించకపోవడంతో విచారణ వాయిదా వేసింది. ముందు కోర్టు ఫీజు చెల్లించాలని కోరింది. అయితే, దీనిపై పిటిషనర్​ తరఫు న్యాయవాది కన్వల్​ప్రీత్​ కౌర్​ స్పందిస్తూ ‘‘హైకోర్టు వెబ్​సైట్​లో ఫీజు లింక్ పనిచేయకపోవడంతోనే మేము ఫీజు చెల్లించలేకపోయాం.” అని కోర్టుకు తెలిపాడు. ఈ కారణంగానే ఫీజు చెల్లించడంలో జాప్యం జరిగిందని కోర్టుకు వెల్లడించాడు.

అయితే, న్యాయవాది సంజాయిషీని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్ మాట్లాడుతూ‘‘పిటిషనర్లు కోర్టు ఫీజు చెల్లించడం లేదనే విషయాన్ని తాను గడిచిన 15 రోజుల నుండి గమనిస్తున్నాను. ప్రజలు పిటిషన్ టైప్ చేయించడానికి ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. కానీ, కోర్టు ఫీజులు చెల్లించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. పిటిషనర్లు కోర్టు ఫీజు ఎందుకు చెల్లించరు? నేను ఈ ఉదయం మా వెబ్​సైట్​ తనిఖీ చేశాను. అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ముందు మీరు వెళ్లి కోర్టు ఫీజు చెల్లించండి. ఆ తర్వాత మీ వాదన వింటాము." అని పిటిషనర్​కు తెలిపింది. పిటిషన్​పై తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. ఆలోపు కోర్టు ఫీజు చెల్లిస్తేనే పిటిషన్​పై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.


కాగా, పిటిషనర్​ తన పిటిషన్​లో, జెఎన్‌యు క్యాంపస్‌లో ఉంటున్నప్పుడు నాకు కోవిడ్–-19 పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యిందని తెలిపారు. క్యాంపస్​లో క్వారంటైన్​ ఫెసిలిటీ లేకపోవడంతో తనను సుల్తాన్​పురి ఐసోలేషన్ సెంటర్‌కు పంపిచారని పేర్కొన్నారు, అక్కడ తాను మేడు రోజుల పాటు ఉన్ననన్నారు. అయితే, అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, రోగులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. క్వారంటైన్​ సెంటల్​లో మరుగుదొడ్లు, బెడ్‌షీట్లు శుభ్రంగా లేవన్నారు. వైద్యులు, నర్సులు కూడా లేరని తెలిపారు. పరిసరాలను శానిటైజ్​ చేయడం లేదని, పరిశుభ్రతను పాటించడం లేదని పేర్కొంది. అంతేకాదు, ఇక్కడ WHO, MOHFW మార్గదర్శకాలు అమలు కావడం లేదని వాపోయింది. వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
Published by:Shiva Kumar Addula
First published: