క్షీణించిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి... ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు...

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.

news18-telugu
Updated: June 19, 2020, 4:23 PM IST
క్షీణించిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి... ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు...
ఢిల్లీ హెల్త్ మినిస్టర్ కు కరోనా
  • Share this:
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ అయిన తర్వాత తాజాగా, నిమోనియా కూడా ఎటాక్ చేసింది. దీంతో సత్యేంద్ర జైన్‌ను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ వెల్ ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సత్యేంద్ర జైన్‌కు కరోనా చికిత్స అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సత్యేంద్ర జైన్ హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంతో అనూహ్యంగా ఇబ్బంది పడ్డారు. 55 సంవత్సరాత సత్యేంద్ర జైన్‌కు తొలిసారి కరోనా పరీక్షల్లో నెగిటివ వచ్చింది. బుధవారం రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.


మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్పత్రిలో చేరడంతో ఆ శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. కరోనా నుంచి కోలుకునే వరకు ఆయన నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను కూడా సిసోడియాకు అప్పగించారు.

First published: June 19, 2020, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading