Delhi Lockdown: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడగింపు.. మెట్రో సర్వీసులు కూడా రద్దు.. ఎప్పటివరకంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు.

 • Share this:
  దేశ‌ంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించారు. మే 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేయనున్నట్టు వెల్లడించారు. పలు వర్గాలకు చెందిన వారితో చర్చించిన అనంతరం లాక్‌డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. లాక్‌డౌన్ సత్పలితాలు ఇస్తుందని.. గత మూడు రోజుల్లో ఢిల్లీలో పాజిటివిటీ రేట్ 35 నుంచి 23 శాతానికి తగ్గిందన్నారు.

  ఇక, ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,364 కరోనా కేసులు నమోయ్యాయి. కొత్తగా 332 మంది మృతిచెందారు. గత ఆరు రోజులుగా ఢిల్లీలో 20 వేలకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలు చేస్తున్నందునన్న పాజిటివిటీ రేటు వరుసగా మూడో రోజు 25 శాతం కంటే తక్కువగా నమోదైంది. ఇక, ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20న తొలిసారిగా లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత పలుమార్లు లాక్‌డౌన్ పొడగించారు.

  దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. కొత్తగా 4,092 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,42,362కి చేరింది.
  Published by:Sumanth Kanukula
  First published: