DELHI GOVERNMENT DECIDED NOT TO REOPEN SCHOOL UNTIL CORONA VIRUS VACCINE COMES AK
Schools Reopen: కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు స్కూళ్లు బంద్.. ఆ రాష్ట్రంలో..
ఫ్రతీకాత్మక చిత్రం
కరోనా లాక్డౌన్ కారణంగా మూతబడ్డ స్కూల్స్‌ను తెరిచేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇందుకు పూర్తి విముఖంగా ఉన్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తున్నారు. కరోనా కేసులు నమోదవుతున్నా.. చిన్న చిన్న లోపాలను అధిగమిస్తూ స్కూళ్లను తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఢిల్లీలో మాత్రం స్కూళ్లను ఇప్పుడప్పుడే తెరిచే ఆలోచన లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు స్కూల్స్‌ను తెరిచే అవకాశం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. ఢిల్లీ విద్యాశాఖమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా చెప్పడంతో.. దేశ రాజధానిలో ఇక ఇప్పుడప్పుడే స్కూల్స్ తెరుచుకునే అవకాశం లేదని తేలిపోయింది.
స్కూల్స్‌కు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఏ మాత్రం సుముఖంగా లేరని ఆయన కొద్ది రోజుల క్రితమే చెప్పారు. ఇలాంటి సమయంలో స్కూల్స్ తెరవడం క్షేమం కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఢిల్లీలో స్కూల్స్ తెరుచుకోవడం ఉండదని అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి స్కూల్స్ మూతపడ్డాయి. అయితే సెప్టెంబర్ 21 నుంచి స్కూల్స్‌ను తెరవాలని భావించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది.
మరోవైపు ఢిల్లీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541కు చేరింది.
గడచిన 24 గంటల్లో 4,943 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 4,93,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 38,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశరాజధానిలో గంటకు ఐదుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. దీనికిముందు సోమవారం కరోనాతో 121 మంది మృతి చెందారు. పండుగల సీజన్లో కరోనా నియమాలను చాలామంది ఉల్లంఘించారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. అలాగే పెళ్లిళ్లకు కూడా భారీగా హాజరవుతూ కరోనా ముప్పు పొంచివుందన్న విషయాన్నే మరచిపోయారు. అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలంతా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.