కరోనాతో పోరుకు ఐదు ఆయుధాలు... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 77000 దాటడంతో... ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవడానిక సిద్ధమైంది.

news18-telugu
Updated: June 27, 2020, 3:14 PM IST
కరోనాతో పోరుకు ఐదు ఆయుధాలు... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
  • Share this:
దేశంలో మహరాష్ట్ర కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రం ఢిల్లీ. సాక్ష్యాత్తూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సైతం కరోన బారిన పడ్డారు. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 77000 దాటడంతో... ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవడానిక సిద్ధమైంది. కరోనాపై పోరాటానికి ఐదు ఆయధాలను సిద్ధం చేసినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రాష్ట్రంలో బెడ్ల సంఖ్యను పెంచడం, టెస్టింగ్ ఐసోలేషన్, ఆక్సిమీటర్లు, ప్లాస్మా థెరపీ, సర్వే స్క్రీనింగ్ వంటిని కరోనాతో పోరాడటానికి ఆయుధాలుగా పని కొస్తాయని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 13500 బెడ్లు ఉండగా... వాటిలో 6000 బెడ్లను మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరించారు. అందుబాటులో మరో 7500 బెడ్లు ఉన్నాయని అన్నారు. కరోనా టెస్టుల సంఖ్యను రోజుకు 20 వేలకు పెంచినట్టు తెలిపారు. కరోనా హారేగా ఔర్ ఢిల్లీ జీతేగా అనే నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు.

First published: June 27, 2020, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading