CM Wife: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో సీఎం

CM Wife: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో సీఎం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. భార్యకు పాజిటివ్ రావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా...

 • Share this:
  న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ.. రచ్చబండ పెద్దల నుంచి రాజకీయ ప్రముఖుల వరకూ కరోనా ఎవరినీ ఉపేక్షించడం లేదు. తాజాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. భార్యకు పాజిటివ్ రావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తున్నారు. సునీత కేజ్రీవాల్‌కు కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకున్నట్లు తెలిసింది. టెస్ట్ రిజల్ట్‌లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత సంవత్సరం జూన్‌లో సీఎం కేజ్రీవాల్‌కు కూడా కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. 73 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్, ఆయన భార్య ఢిల్లీలో ఉంటున్నారు. భూపేందర్‌కు కూడా జ్వరం రావడంతో ఆయనకు, ఆయన భార్యకు కరోనా టెస్టులు చేయగా.. ఆయన భార్యకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  ఇదిలా ఉంటే.. ఢిల్లీలో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతుండటంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని సీఎం కోరారు. ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటన చేసిన సందర్భంలో సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 23,500 కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం చెప్పారు. పాజిటివిటీ రేటు, వైరస్ వ్యాప్తి పెరిగిందని కేజ్రీవాల్ తెలిపారు. రోజుకు 25,000 కరోనా కేసులు నమోదయితే.. అందుకు తగినన్ని బెడ్లు లేవని, బెడ్స్ కొరత ఉందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు, మెడికల్ సేవలు, ఫుడ్ సర్వీసెస్ కొనసాగుతాయని.. లాక్‌డౌన్ నుంచి ఈ సేవలకు మినహాయింపు ఉందని కేజ్రీవాల్ తెలిపారు. పెళ్లిళ్ల వంటి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువగా హాజరవకూడదని, పెళ్లి వేడుక చేసుకునేవారికి ప్రత్యేకంగా పాసులు మంజూరు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇక.. బెడ్స్ కొరతకు సంబంధించి కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఈ ఆరు రోజుల లాక్‌డౌన్ సమయంలో మరిన్ని బెడ్స్ ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆక్సిజన్, మెడిసిన్ తగినన్ని ఉండేలా చూసుకుంటామని సీఎం చెప్పారు. అందరూ లాక్‌డౌన్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సీఎం కోరారు.

  అంతేకాదు.. ఢిల్లీలో ఉన్న వలస కార్మికులకు కూడా సీఎం ఓ అభ్యర్థన చేశారు. చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. ఇది పరిమిత లాక్‌డౌన్ మాత్రమేనని, కేవలం ఆరు రోజులేనని సీఎం చెప్పారు. దయచేసి ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లవద్దని ఆయన కోరారు. ఈ లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి రాదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్న కేజ్రీవాల్, ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని వలస కార్మికులకు హామీ ఇచ్చారు.
  Published by:Sambasiva Reddy
  First published: