కరోనా వారియర్ ఫ్యామిలీకి రూ.కోటి సాయం.. చెక్కు అందజేసిన సీఎం

జోగిందర్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా. కుటుంబం మొత్తం ఆయనపైనే ఆధారపడి జీవిస్తోంది. జోగిందర్ తండ్రి రాజేంద్ర చౌదరి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 10:14 PM IST
కరోనా వారియర్ ఫ్యామిలీకి రూ.కోటి సాయం.. చెక్కు అందజేసిన సీఎం
జోగిందర్ తండ్రికి చెక్కు అందజేస్తున్న సీఎం
  • Share this:
కరోనాపై మానవాళి చేస్తున్న పోరాటంలో డాక్టర్లు ముందు వరుసలో ఉన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు డాక్టర్లు కరోనాతో మరణించారు. అలాంటి కరోనా వారియర్స్ కుటుంబాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదుకుంటోంది. కరోనా మరణించిన డాక్టర్ జోగిందర్ చౌదరి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. వారికి బుధవారం సాయంత్రం సీఎం కేజ్రీవాల్ తన చేతుల మీదుగా చెక్కును అందజేశారు.

కరోనాతో మరణించిన జోగిందర్ చౌదరి.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేసేవారు. తన ప్రాణాలను కూడా పట్టించుకోకుండా కరోనా రోగులకు చికిత్స అందించేవారు. రోగుల పట్ల ప్రత్యేకమైన కేర్ చూపిస్తూ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేవారు. ఆ క్రమంలో డాక్టర్ జోగిందర్‌కు కూడా కరోనా సోకింది. జూన్ 27న అంబేద్కర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో LNJP ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐనప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జూలై 8న గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఇటీవల ఆయన తుదిశ్వాస విడిచారు.

జోగిందర్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా. కుటుంబం మొత్తం ఆయనపైనే ఆధారపడి జీవిస్తోంది. జోగిందర్ తండ్రి రాజేంద్ర చౌదరి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగిందర్ కుటుంబాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఆదుకుంది. రూ. కోటి ఆర్థికసాయం అందించింది. జోగిందర్ మృతి పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 10:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading