Delhi : మరోవారం లాక్డౌన్ పొడగింపు ..వద్దంటున్న వ్యాపారులు

Delhi : మరోవారం లాక్డౌన్ పొడగింపు ..వద్దంటున్న వ్యాపారులు

ఢిల్లీలో వారంపాటూ కర్ఫ్యూ (అరవింద్ కేజ్రీవాల్ - File Image)

Delhi lockdown : ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా పాజిటివిటి రేటు తక్కువ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

  • Share this:
ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడగించారు.సోమవారంతో లాక్‌డౌన్ ముగియనుండడంతో నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి వారం రోజుల పాటు లాక్‌‌డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత నెల రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో స్థానిక వ్యాపారులు లాక్‌డౌన్ తొలగించాలని సీఎంను కోరారు. కాని కొవిడ్ రోగుల సంఖ్యలో మార్పులు రాకపోవడంతో సీఎం ఈనిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

కరోనా సెకండ్‌వేవ్‌తో గత కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఓ వైపు ఆక్సిజన్ కొరత మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో వారం రోజుల పాటు నరకం చూశారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. ముందుగా వారాంతపు లాక్డ్‌న్ ప్రకటించిన కేజ్రీవాల్ ఏప్రిల్ 19 నుండి పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటించారు. కేసులు కట్టడి కాకపోవడంతో పాటు పెరుగుతుండడంతో మరో వారం పాటు లాక్‌డౌన్ విధించారు. ప్రస్తుతం విధించిన లాక్డౌన్ వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది.

కాగా ఢిల్లీ కరోనా పాజిటీవ్‌ల మొత్తం మీద ఒక్క శాతం మాత్రమే తగ్గినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.శనివారం కరోనా పాజీటీవ్ వచ్చిన వారు 6430 మంది ఉండగా ఇది మొత్తం టెస్టుల్లో 11 శాతంగా నమోదైంది.ఇక శనివారం రికవరి అయినవారు 11 591 ఉండగా 337 మంది కరోనాతో మృతి చెందారు. కాగా మొత్తం 66000 కేసులు ఆక్టీవ్‌గా ఉన్నాయి.
Published by:yveerash yveerash
First published: