Oxygen Shortage: తీవ్ర విషాదం.. ఆక్సిజన్ కోరతతో డాక్టర్ సహా 8 మంది మృతి..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కేసులు పెరుగుతున్న వేళ మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కోరత తీవ్రంగా ఉంది.

  • Share this:
    దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పలు ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో రోగులు ఆక్సిజన్ కోరత కారణంగా మరణించారు. తాజాగా మరో 8 మంది రోగులు ఆక్సిజన్ అందక మృతిచెందారు. అందులో ఓ డాక్టర్ కూడా ఉన్నారు. ఈ ఘటన ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్‌లో శనివారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మెడికల్ ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయి. మధ్యాహ్నం 1.35 గంటలకు అక్కడికి ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకుంది. దీంతో ఆస్పత్రిలో ఆక్సిజన్ కోరత కారణంగా రోగులు మరణించారు. ఈ విషయాన్ని బాత్రా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

    శనివారం సాయంత్రం నుంచే ఆక్సిజన్ కోరతకు సంబంధించి తాము అధికారులకు చెబుతూనే ఉన్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 327 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారని.. వారిలో 48 మంది క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉన్నారని వెల్లడించాయి. ఇక, వారం క్రితం ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ కోరత తలెత్తగా.. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎమర్జెన్సీ ఆక్సిజన్ పొందింది. కరోనా వైరస్ కేసుల భారీగా పెరగడం వల్ల ఆక్సిజన్ కోరత తీవ్రంగా ఉంది.

    వారం రోజుల క్రితం ఆక్సిజన్‌ అందక ఢిల్లీలో జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ కోరత కారణంగా 20 మంది రోగులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇక, ఢిల్లీలోని పలు ఆస్పత్రులు తమ వద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: