Home /News /coronavirus-latest-news /

DELATA PLUS VARIANT IS MOST DANGEROUS THAN PAST DELATA VARIANT EXPERTS OPINION VRY

Covid : డెల్టా ప్లస్ మరింత డేంజర్... తుమ్మడం... కాదు... పక్కనుండి పోయినా...పట్టుకుంటుంది...!

Covid : డెల్టా ప్లస్ మరింత డేంజర్... తుమ్మితే... కాదు... పక్కనుండి పోయినా...పట్టుకుంటుంది...!

Covid : డెల్టా ప్లస్ మరింత డేంజర్... తుమ్మితే... కాదు... పక్కనుండి పోయినా...పట్టుకుంటుంది...!

Covid : దేశంలో కరోనా కొత్త వేరియంట్లు ప్రజల్లో ఆందోళనను కల్గిస్తున్నాయి..ఇప్పటికే పలు వేరియంట్స్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి..తాజగా డెల్టా ప్లస్ వేరియంట్ మహా డేంజర్‌గా కనిపిస్తోంది. కనీసం మనిషి పక్కనుండి పోయినా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ధర్డ్‌వేవ్ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
కరోనా సెకండ్ వేవ్‌ కొంత తగ్గి సాధారణ జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్ ముప్పు ముంచుకువస్తుంది. ముఖ్యంగా కరోనా రెండో వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ మరింత శక్తివంతమైన ప్రభావంతో డెల్టా ప్లస్‌గా మారినట్టు ఇటివలే ప్రకటించారు. అయితే ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారుతోందని, దీని భారిన పడిన వారి పక్క నుండి, మాస్క్‌ పెట్టుకోకుండా వెళ్లినా మహమ్మారి భారిన పడే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరక్టర్ రణదీర్ గులేరియా హెచ్చరించారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఈ డెల్టా వేరియంట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 40 కేసులు గుర్తించినట్టు తెలిపారు.కొత్త వేరియంట్ యాంటిబాడిస్ మందులను తట్టుకుని నిలబడుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ డేల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా.. చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా దేశంలోని ఈ వేరియంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ రాష్ట్రాలతో పాటు మన పక్కరాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుతోపాటు కశ్మీర్‌లో కూడా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రాలో ఈ వైరస్ భారిన 21 మంది పడ్డారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న సమయంలో ఇది బయటపడడం స్థానిక ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పారు.

మరోవైపు ఈ వేరియంట్ ప్రస్తుత వ్యాక్సిన్స్‌ తట్టుకుంటుందా లేదా అనే దానిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వేరియంట్స్ రూపాంతరం చెందుతూ కొత్తగా పుట్టుకువస్తుంటాయిని, ఇది నిత్య ప్రక్రియగా మారుతుందని, ఇలా నయా వేరియంట్లు వస్తూ పోతుంటాయని, కాని సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వైరాలజి నిపుణులు చెప్పారు.

ఏది ఏమైనా రానున్న రెండు మూడు నెలలు ప్రజలపై కొత్త వేరియంట్ ప్రభావం ఏ మేరకు ఉంటుందని ఇప్పుడే అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు దేశ వ్యాప్తంగా లాక్డ్‌డౌన్ నిబంధనలను తొలగిస్తున్న సమయంలో ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతం చేందిన డేల్టా ప్లస్ సోకడం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కాని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా ముఖ్యమని భావిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona alert, Corona latest news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు