కరోనా మృతుల అంత్యక్రియలు ఆ పద్ధతిలోనే.. ఏ మతమైనా సరే..

Corona deaths : దేశంలో కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనాతో మరణించే వాళ్ల సంఖ్య ఎక్కువవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: March 31, 2020, 9:40 AM IST
కరోనా మృతుల అంత్యక్రియలు ఆ పద్ధతిలోనే.. ఏ మతమైనా సరే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Coronavirus Outbreak : ఇండియాలో కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 32 మంది మృతి చెందారు. 101 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 1117 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనాతో మరణించే వాళ్ల సంఖ్య ఎక్కువవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి చనిపోయిన వాళ్లను మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ తెలిపారు. అంత్యక్రియలకు ఐదుగురికి మించి హాజరు కావొద్దని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా శవాలను కచ్చితంగా పూడ్చి పెట్టాలని అనుకుంటే ముంబై పరిసర ప్రాంతాలు దాటి.. వేరే ప్రాంతంలో పూడ్చి పెట్టుకోవచ్చని ఆయన సూచించారు.

కాగా, చైనాలో కరోనాతో మరణించిన వాళ్లను దహనం చేసిన సంగతి తెలిసిందే. పూడ్చి పెడితే వ్యాధి ప్రమాద స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందన్న కారణంతో ఆ నిర్ణయం తీసుకుంది.
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading