హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Vaccine: వ్యాక్సీన్‌ వచ్చేసింది.. కోవిషీల్డ్, కొవాగ్జిన్‌కు DCGI ఆమోదం..

Corona Vaccine: వ్యాక్సీన్‌ వచ్చేసింది.. కోవిషీల్డ్, కొవాగ్జిన్‌కు DCGI ఆమోదం..

తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

మన దేశంలో కోవిషీల్డ్ (covishield), కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సీన్‌లకు DCGI (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోద ముద్రవేసింది. ఐతే అత్యవసర సమయంలో పరిమిత వినియోగానికి మాత్రమే ఆమోదం తెలిపింది.

  దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా వాక్సీన్‌ వచ్చేసింది. మన దేశంలో కోవిషీల్డ్ (covishield), కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సీన్‌లకు DCGI (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోద ముద్రవేసింది. ఐతే అత్యవసర సమయంలో వినియోగానికి షరతులతో అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐతే క్లినికట్ ట్రయల్స్ మాత్రం కొనసాగుతాయని డీసీజీఐ డాక్టర్ వి.జి. సోమని తెలిపారు. ఇక జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వాక్సిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సీన్‌లను రెండు డోస్‌లు వేసుకోవాల్సి ఉంటుందని డీసీజీఐ తెలిపింది. జైకోవ్-డీ వ్యాక్సీన్‌ను మూడు డోసులు వేసుకోవాలని వెల్లడించింది.

  ''కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి CDFCO సిఫారసు చేసింది. కోవిషీల్డ్ టీకా భద్రత, సామర్థ్యంపై సీరం సంస్థ వివరాలు సమర్పించింది. ఐసీఎంఆర్, ఎన్ఐవీతో కలిసి కొవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తయారుచేసింది. కొవాగ్జిన్ భద్రమైనదేనని ఇప్పటికే నిరూపితమయింది. తొలి రెండు దశల్లో 800 మందిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. మూడో దశలో 25,800 మందికి కోవాగ్జిన్ టీకాను ఇచ్చారు. వాక్సిన్‌ను రెండు డోసలు తీసుకోవాలి. కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను 2 నుంచి 8 డిగ్రీల వాతావరణంలో నిల్వ చేయవచ్చు.'' అని డీసీజీఐ తెలిపింది.


  వాక్సిన్‌కు డీసీజీఐ ఆమోద ముద్ర వేసిన సందర్భంగా శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అత్మనిర్భర్ భారత్ కలను శాస్త్రవేత్తలు సాకారం చేశారని కొనియాడారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందు వరసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.
  కాగా, కోవిషీల్డ్ వాక్సీన్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రజెనికా సంయుక్తంగా తయారుచేశాయి. ఈ వ్యాక్సీన్‌ను మనదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేస్తోంది. మన హైదరాబాద్‌లో తయారైన కోవాగ్జిన్‌కు కూడా డీసీజీఐ ఆమోదం తెలిపింది. ఐసీఎంఆర్, ఎన్ఐవీతో కలిసి భారత్ బయోటక్ కంపెనీ సంయుక్తంగా ఆ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వం కూడా వ్యాక్సీనేషన్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డీసీజీఐ ఆమోద ముద్రవేసిన నేపథ్యంలో త్వరలోనే వ్యాక్సీనేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covaxin, Covid-19, COVID-19 vaccine

  ఉత్తమ కథలు