ఇండియాలో కరోనాకి మరో మందు... DCGI అనుమతి... ఎలా వాడాలంటే...

ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో... కొత్త కొత్త మందులకు DCGI అనుమతులు ఇస్తుండటం మంచి విషయమే. మందుల కొరతను అడ్డుకోవడానికి వీలవుతుంది.

news18-telugu
Updated: July 11, 2020, 11:36 AM IST
ఇండియాలో కరోనాకి మరో మందు... DCGI అనుమతి... ఎలా వాడాలంటే...
ఇండియాలో కరోనాకి మరో మందు (credit - twitter)
  • Share this:
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ రావడానికి 2021 ఏప్రిల్ దాకా పట్టొచ్చనే తాజా అంచనాల మధ్య డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పేషెంట్లకు అత్యవసర సమయాల్లో వాడేందుకు ఇటోలిజుమాబ్ (Itolizumab) అనే ఇంజెక్షన్ మందుకు అనుమతులు ఇచ్చింది. కరోనా పేషెంట్లపై ఈ మందును ప్రయోగించగా సంతృప్తి కర ఫలితాలు వచ్చాయి. సహజంగా... దీన్ని చర్మ వ్యాధి అయిన సొరియాసిస్ (psoriasis)ను తగ్గించేందుకు వాడుతున్నారు. బెంగళూరులోని బయోకాన్ బయో ఇండియా లిమిటెడ్ ఈ మందుకు సొరియాసిస్‌కి వాడేందుకు చాలా ఏళ్ల కిందట అనుమతి పొందింది. ఇప్పుడు అదే మందు కరోనాకీ పనిచేస్తోంది.


ఇటోలిజుమాబ్ చాలా పవర్‌ఫుల్. అందుకే కరోనా పేషెంట్లందరికీ దీన్ని ఇవ్వరు. కరోనా చాలా తీవ్రంగా ఉంది, ప్రాణాలు పోయేలా ఉన్నాయి అనే పరిస్థితి ఉంటేనే ఇస్తారు. కరోనా అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి కృషి చేసే సైటోకిన్లను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇది ఎక్కువ పవర్‌ఫుల్ కాబట్టి... మందును తీసుకోవాలనుకునేవారు... ముందుగానే... అంగీకారం తెలుపుతూ... పేపర్‌పై రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది.

కరోనా వచ్చాక... చాలా మందుల్ని పేషెంట్లపై ప్రయోగించి చూస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతుంటే... కొన్ని ఫెయిలవుతున్నాయి. ఒక్కోసారి కాంబినేషన్లలో మందులు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఈ ఇటోలిజుమాబ్‌ని... మే నెలలో ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇచ్చింది. వాళ్లు కోలుకొని సాధారణ స్థితికి వచ్చారు. ఈ మందు చాలా వరకూ ఒక డోస్ ఇవ్వగానే... రోగులు కోలుకుంటున్నారు. కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోంది.ప్రస్తుతం ఇండియాలో... రెమ్‌డెసివిర్‌, ఫవిపిరవిర్‌ మందులను కరోనా పేషెంట్లకు వాడుతున్నారు. అవి బాగానే పనిచేస్తున్నా... వాటి సప్లై సరిపోవట్లేదు. పైగా... బ్లాక్‌మార్కెట్‌లో రేట్లు పెంచి అమ్ముతున్నారు. మరోవైపు డాక్టర్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ని కూడా వాడొచ్చని ఇది వరకూ ICMR తెలిపింది. ఐతే... హైడ్రాక్సీ క్లోరోక్విన్ మరణాల్ని ఆపలేకపోతోందనే వాదన ఉంది. తాజాగా ఇటోలిజుమాబ్ బాగానే పనిచేస్తే... అది కరోనా పేషెంట్లకు మరో దివ్య ఔషధంలా మారే అవకాశం ఉంటుంది.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading