Home /News /coronavirus-latest-news /

DCGI APPROVED BHARAT BIOTECH NASAL VACCINE MAY BE USED AS BOOSTER DOSE AK

Nasal Vaccine: భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్.. బూస్టర్ డోస్‌గా వినియోగం !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nasal Vaccine: సాధారణ వ్యాక్సిన్ కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ ట్రయల్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదించింది. ఈ టీకా బూస్టర్ డోస్‌గా ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం 900 మందిపై దీని ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇది ఈ టీకాకు సంబంధించిన మూడో డోస్ ట్రయల్ కానుంది. ఇప్పటికే ఈ నాసల్ వ్యాక్సిన్‌కు సంబంధించి కంపెనీ మూడు వారాల క్రితమే డీసీజీఐ నిపుణుల కమిటీకి డేటాను పంపింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్.. ఒమిక్రాన్ నుంచి కూడా రక్షణ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ బయోటెక్ తన నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా ఉపయోగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గతంలో కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది. దేశంలో ఈ నెల నుంచే కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేసే వ్యక్తులకు కరోనా మూడో డోసు వ్యాక్సిన్ ఇవ్వడం మొదలైంది.

    భారత్ బయోటెక్ తన నాసల్ వ్యాక్సిన్‌ BBV154ను ఇప్పటికే టీకాలు వేసిన వ్యక్తులలో బూస్టర్ డోస్‌గా ఉపయోగించాలని ప్రతిపాదించింది. మిడ్-టు-లేట్-స్టేజ్ ట్రయల్స్ కోసం గత ఏడాది ఆగస్టులో రెగ్యులేటరీ ఆమోదం పొందింది. ఇప్పటికే కోవాషీల్డ్ లేదా కోవాక్సిన్ తీసుకున్న వ్యక్తులపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ చేయబడుతుంది.

    సాధారణ వ్యాక్సిన్ కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మొదట యాంటీబాడీస్ ముక్కులో ఏర్పడతాయి. ఇది శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోకి వైరస్ చేరడం కష్టతరం చేస్తుంది. ఫలితంగా నాసల్ వ్యాక్సిన్ తీసుకున్నవారి ఊపిరితిత్తుల్లోకి వైరస్ చేరదు.

    NeoCov : గబ్బిలాల్లో మరో కొత్త వైరస్..ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారన్న వూహాన్ సైంటిస్టులు

    Vaccine For Children : ఆ వయస్సు పిల్లలు కూడా వ్యాక్సిన్ కు అర్హులే..కేంద్రం కీలక నిర్ణయం

    ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య విశ్వనాథన్ కూడా నాసల్ వ్యాక్సిన్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పారు. దీని వల్ల ఎలాంటి నొప్పి ఉండదని.. దీనిని తీసుకోవడానికి ఎక్కువ ప్రక్రియ కూడా అవసరం లేదని డాక్టర్ సౌమ్య తెలిపారు.

    ఇక భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, కంపెనీ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bharat Biotech, Corona Vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు