Covid-19: అమ్మను బతికించుకోవాలనే ఆరాటం.. ఆక్సిజన్ లేక నోటితో శ్వాస ఊదిన కూతురు.. Heartbreaking Video

(Image-Twitter)

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్ కోరత కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో పోరాడుతూ.. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న ఓ మహిళనకు ఆమె కూతురు నోటితో శ్వాస అందిచేందుకు చేసిన ప్రయత్నం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. పలు చోట్ల ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్నిచోట్ల కరోనా పెషేంట్లకు ఆస్పత్రులలో బెడ్స్ దొరకని పరిస్థితి. కరోనా పెషేంట్లను బతికించుకోవడానికి వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు కనీళ్లు పెట్టించే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ మహిళను కాపాడేందుకు ఆమె కూతుళ్లు నోటి ద్వారా ఆక్సిజన్ అందించారు. అయిన ఫలితం లేకుండా పోయింది. ఆక్సిజన్ కోరత వల్ల ఆమె ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో బహ్రాయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    వివరాలు.. కరోనా సోకిన ఓ మహిళను ఆమె ఇద్దరు కూతుళ్లు కలిసి ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు వచ్చి చికిత్స అందించే లోపే ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో తల్లిని బతికించుకోవడానికి.. ఆమె కూతురు ప్రాణాలకు తెగించింది. కరోనా సోకిన తల్లికి నోటి ద్వారా శ్వాస అందిస్తూ కాపాడే ప్రయత్నం చేసింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆ మహిళ చనిపోయింది. ఈ సన్నివేశం చూసిన అక్కడి వారు తీవ్రంగా చలించిపోయారు.





    ఇక, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ బారిన పడిన భర్తను కాపడుకోవడానికి రేణు సింఘాల్ అనే మహిళ అతనికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఆస్పత్రికి చేరకముందే ప్రాణాలు కోల్పోయాడు. ఇక, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,92,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,49,943కు చేరింది. తాజాగా కరోనాతో 3,673 మంది మరణించడంతో మొత్తం మృతులు 2,15,454కు పెరిగారు.
    Published by:Sumanth Kanukula
    First published: