Andhra Pradesh: కంటే కూతుర్నే కనాలి. కరోనా అని తెలిసి తండ్రికి ప్రాణం పోయాలని పోరాటం

నాన్న ప్రాణాలు కాపాడాలని కూతురు తాపత్రయం

కంటే కూతుర్నే కనాలి అని అందుకే అంటారేమో.. నిజంగానే శ్రీకాకుళంలో జరిగిన ఘటన చూస్తే ఆ కూతరి ప్రేమను విలువ కట్టలేం.. తండ్రికి కరోనా సోకిందని తెలిసినా.. తన ప్రాణాల గురించి ఆలోచించకుండా తండ్రిని కాపాడుకోవాలని ప్రయత్నించింది.

 • Share this:
  సాధారణంగా తండ్రిపై కూతురుకి అధిక  ప్రేమ ఉంటుంది అంటారు. అది నిజమే అని మరో సంఘటన నిరూపించింది. ప్రస్తుతం దేశం మొత్తాన్ని కరోనా వైరస్ మహమ్మారి కబళించేస్తోంది. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రక్త సంబంధీకులపైనా, మన ఇంట్లో రోజూ మనతో ఉన్నవాళ్లే అయినా.. వారికి కరోనా అని తెలిస్తే చాలు అటు వైపు కూడా వెళ్లే సాహసం చెయ్యడం లేదు ఎవరూ. ఇటీవల చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చూశాం. కరోనా సోకిందని రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలి అంటే ప్రైవేటు వాహనాలు ముందుకు రావడం లేదు. మరోవైపు కుటుంబ సభ్యులు సైతం కరోన వచ్చిన వారిని అంటరాని వాళ్లలా చూడడంతో చాలామంది మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా చాలానే  ఉన్నాయి.

  ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఓ కూతురు ధైర్యం చేసింది. కోవిడ్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్న తండ్రిని చూసి ప్రాణం విలవిలలాడిపోయింది. తండ్రిని కాపాడుకోవాలని ఆరాటపడింది. తల్లి వద్దని వారిస్తున్నా తండ్రి దగ్గరికి వెళ్లింది. తండ్రి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. కానీ పాపం.. ఆ వెంటనే అతడు మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో చేటు చేసుకుంది.

  జగన్నాథ వలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన 44 ఏళ్ అసిరి నాయుడు విజయవాడలో కూలి పనులు చేసుకునే వాడు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంసభ్యులతో ఆదివారం స్వగ్రామానికి వచ్చేశాడు. అయితే కరోనా పాజిటివ్ ఉందని తెలియడంతో స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ గుడిసెలో ఉండాలని సూచించారు. కరోనా టైంలో చేసేది ఏం లేక వారు అలానే ఊరికి చివర్లో ఉన్నారు. ఇంతలో అసిరి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కింద పడిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కట్టుకున్న భార్య సైతం దగ్గరికి వెళ్లే సాసహం చెయ్యలేకపోయింది.

  కరోనా భయంతో స్థానికులు కూడా దగ్గరికి వెళ్లలేకపోయారు. కళ్ల ముందు కన్నతండ్రి పరిస్థితి చూసిన కూతురి మనసు తట్టుకోలేపోయింది. కరోనా భయంతో తల్లి వద్దంటున్నా వినకుండా.. కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేకపోయింది. అందకే వద్దు అని చెబుతున్నా అతడి దగ్గరగా వెళ్లింది. తండ్రి గొంతులో నీరు పోసింది. కానీ లాభం లేకపోయింది. ఆ వెంటనే అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కరోనా ఎలాంటి దయనీయ పరిస్థితులు తీసుకొచ్చింది అని అంతా కన్నీటిపర్యంతం అయ్యారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని అక్కడనున్నవారంతా విలపించారు.
  Published by:Nagesh Paina
  First published: