ఇంటర్నెట్‌ డేటాకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్...వర్క్ ఫ్రం హోమ్ దెబ్బతో...

(ప్రతీకాత్మక చిత్రం)

ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడటంతో ఇంటర్నెట్‌ డాటాకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు తెలియజేస్తున్నారు. అటు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ పది శాతం పెరిగిందని గుర్తించారు.

  • Share this:
    కరోనా ప్రభావంతో వర్క్‌ ఫ్రం హోం చేయమని కంపెనీలు అవకాశం ఇచ్చేశాయి. దీంతో ఉద్యోగులంతా ఇంటర్నెట్ డేటాపై ఆధారపడ్డారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడటంతో ఇంటర్నెట్‌ డాటాకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు తెలియజేస్తున్నారు. అటు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ పది శాతం పెరిగిందని గుర్తించారు. ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడం కారణంగా నెట్‌వర్క్‌ స్తంభించే అవకాశం లేదని, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌.మ్యాథ్యూస్‌ వెల్లడించారు. డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకావని, నెట్‌వర్క్స్‌ అన్నీ ఎంతో సామర్థ్యంతో ఉన్నాయన్నారు. ఆందోళన అవసరం లేదని చెప్పారు. మరోవైపు రిలయన్స్‌ జియో వంటి టెలికాం కంపెనీలు టాప్‌ అప్స్‌కు తగ్గట్టుగా సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్‌ చేసింది. అటు ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపజేస్తోంది మరో వైపు బీఎస్ఎన్ఎల్ కూడా తమ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు నెలరోజుల పాటు ఉచితంగా సేవలను అందిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: