రజనీకాంత్ చేసిన పాత్రలో లారెన్స్... పదిహేనేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్..

రజనీకాంత్ చేసిన పాత్రలో లారెన్స్... పదిహేనేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్..

రాఘవ లారెన్స్: అక్టోబర్ 29, వయసు 44

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖి.

  • Share this:
    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖి. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పి.వాసు దర్శకత్వంలో 2005లో విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. తమిళలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. 'చంద్రముఖి'లో రజనీకాంత్‌‌తో పాటు జ్యోతిక మైమరిపించే నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. కాగా.. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందనున్నది. ఈ సీక్వెల్‌లో లారెన్స్‌ హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని లారెన్స్‌ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆయన తన సోషల్ మీడియాలో రాస్తూ.. 'రజనీకాంత్‌ అనుమతి, ఆశీర్వాదంతోనే ఈ సీక్వెల్‌ను మొదలుపెట్టనున్నాం.ఇంత గొప్ప సినిమాలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సీక్వెల్‌కు పి.వాసు దర్శకత్వం వహించనున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు' అని లారెన్స్‌ తెలిపాడు. దీంతో తన పోస్ట్‌లో లారెన్స్‌ రాస్తూ..కరోనా బాధితులకు మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించానని తెలిపాడు. అందులో భాగంగా పీఏం కేర్స్‌కు 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి యాభై లక్షలు అందించారు. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌కు 50 లక్షలు, డ్యాన్సర్‌ యూనియన్‌కు 50 లక్షలు ఇచ్చానని.. స్వస్థలం రోయపురానికి చెందిన రోజువారి కార్మికులకు 75 లక్షలు, మానసిక వికలాంగులైన పిల్లలకు 25 లక్షలు అందించాని తెలిపాడు.

    Published by:Suresh Rachamalla
    First published: