దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా చేయని స్థాయిలో టెస్ట్‌లు ఏపీలో చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కేవలం ప్రతిరోజు టెస్టుల కోసమే రూ.5 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 16లక్షల 43వేల 319 మందికి టెస్ట్‌లు చేశామని, సంపూర్ణ ఆరోగ్యంతో 46,301 మందిని ఇంటికి పంపామని ఆయన తెలిపారు. ప్రతి రోజు 50వేల టెస్ట్ లు చేసే సామర్ధ్యాన్ని పెంచుకున్నామని తెలిపారు. టెస్టుల సామర్ధ్యం బట్టే కేసులు పెరుగుతున్నాయని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రతి జిల్లాకు కాల్ సెంటర్ పెట్టి ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రులను 138కి పెంచామని చెప్పారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పెంచామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. చంద్రబాబు పైశాచికం ఆనందలో ఉన్నారని విమర్శించారు. ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని... సీఎం జగన్ అత్యంత సమర్థవంతంగా పాలన చేస్తున్నారని ఆళ్ల నాని అన్నారు.
చంద్రబాబు హయాంలో ఒక్క డాక్టర్‌ని నియమించలేదని ఆళ్ల నాని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జిల్లా ఆస్పత్రులను గాలికొదిలేశారని ఆరోపించారు. గతంలో 104,108 వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ,ఆరోగ్యశ్రీని నిలిపేవేసి పేదలను బలిగొన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బాధ్యతగా లేకపోతే తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలకలాపాలకు అడ్డుతగిలితే సహించబోమని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Nani, Andhra Pradesh, Chandrababu naidu, Covid-19