సెలూన్లలో ఆధార్ తప్పనిసరి.. అసంతృప్తిలో కస్టమర్లు..

వాస్తవానికి మే 24 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో ఆధార్ నంబరు ఇస్తేనే అనుమతించగా, సోమవారం నుంచి చెన్నై వరకు మాత్రమే పరిమితం చేశారు.

news18-telugu
Updated: June 4, 2020, 7:12 AM IST
సెలూన్లలో ఆధార్ తప్పనిసరి.. అసంతృప్తిలో కస్టమర్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కస్టమర్ల నుంచి ఆధార్ నంబర్లు సేకరించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్‌ను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై ఇటు సెలూన్లు, బ్యూటీ పార్లర్ల నిర్వహకులు.. అటు వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. హెయిర్ కటింగ్ కోసం వచ్చే కస్టమర్ల నుంచి ఫోన్ నంబరు తీసుకుంటే సరిపోతుందని, ఆధార్ నంబరు ఎందుకంటూ బదులిస్తున్నారు. వాస్తవానికి మే 24 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో ఆధార్ నంబరు ఇస్తేనే అనుమతించగా, సోమవారం నుంచి చెన్నై వరకు మాత్రమే పరిమితం చేశారు. కరోనా వైరస్ సోకిన వారు హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లలోకి వస్తే..

అది ఇతరులకు సోకకుండా ఉండేందుకు ఏడు పేజీల బుక్ లెట్‌ను సెలూన్ల యాజమానులు, సిబ్బందికి అందజేశారు. ఉద్యోగులు తప్పనిసరిగా చేతి గ్లౌజులు, ఫేస్ మాస్కులు ధరించాలని, కస్టమర్లను తాకేముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని, వినియోగదారులకు ఇచ్చిన న్యాప్ కిన్స్‌ను సురక్షితంగా పడేయాలని విపత్తు నిర్వహణ కమిషనర్ జే.రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు నంబర్లు సేకరించడంపై వ్యతిరేకత వస్తోంది.
First published: June 4, 2020, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading