కరోనా దెబ్బకు జిమ్స్ బంద్.. వర్కవుట్స్ కోసం రైనా ఏం చేశాడంటే..?

ఫామ్ కోల్పోయి టీమిండియాకు దూరమైన సురేశ్ రైనా.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు సభ్యుడు.

news18-telugu
Updated: March 19, 2020, 4:44 PM IST
కరోనా దెబ్బకు జిమ్స్ బంద్.. వర్కవుట్స్ కోసం రైనా ఏం చేశాడంటే..?
సురేష్ రైనా
  • Share this:
కరోనావైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంపైనా పడింది. ఇప్పటికే ఐపీఎల్ సహా పలు దేశీయ, అంతర్జాతీయ టోర్నీలు వాయిదాపడ్డాయి. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఫిట్‌నెస్ పోతుందేమోనని భయపడుతున్నారు. పోనీ జిమ్‌కి వెళ్దామంటే కరోనా దెబ్బకు అన్ని జిమ్స్ మూతపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో సురేష్ రైనా సరికొత్త జిమ్‌ని సృష్టించాడు. పచ్చని ప్రకృతిలో చెట్ల మధ్య వర్కవుట్స్ చేస్తున్నాడు. చెట్టుకు బెల్ట్ కట్టి జిమ్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అన్ని జిమ్స్ మూతపడినంత మాత్రాన.. వర్కవుట్స్ చేయకుండా ఉంటామా? అని కామెంట్ చేశాడు రైనా.

కాగా, ఫామ్ కోల్పోయి టీమిండియాకు దూరమైన సురేశ్ రైనా.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు సభ్యుడు. ఐతే మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్13 కరోనా ప్రభావంతో వాయిదా పడింది. వ్యాధి ప్రభావం తగ్గితే ఏప్రిల్ 15 నుంచి టోర్నీని ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది.

First published: March 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు