రైల్వే కోచ్‌లే కరోనా ఐసోలేషన్ వార్డులు...3 లక్షల బెడ్స్ సిద్ధం చేస్తున్న కేంద్రం...

రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్ కోచ్ లను సిద్ధం చేసింది.

news18-telugu
Updated: March 28, 2020, 12:28 PM IST
రైల్వే కోచ్‌లే కరోనా ఐసోలేషన్ వార్డులు...3 లక్షల బెడ్స్ సిద్ధం చేస్తున్న కేంద్రం...
కరోనా కోసం ఐసోలేషన్ కోచ్ లు సిద్దం
  • Share this:
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భోగీలలో ఐసోలేషన్ వార్డులుగా ఏర్పాటు చేసింది. ఆగిపోయిన రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్ కోచ్ లను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సరైన వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్యసదుపాయలను అందించే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న 13వేలపైగా రైళ్లు నడిచే భారత్ లో.. రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల మొత్తం 3 లక్షల బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఈ కోచ్ లలో టాయిలెట్లు కూడా ఉన్నందున ఐసోలేషన్ వార్డులుగా కూడా ఉపయోగించవచ్చని సూచనలు చేస్తున్నారు. అలాగే రైళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే అంబులెన్సులను కూడా ప్రభుత్వానికి అందించవచ్చని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే శాఖ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.

రైల్వే కోచ్‌లే కరోనా ఐసోలేషన్ వార్డులు...

First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading