Corona: కేరళ సీపీఎం యువ నేత కన్నుమూత.. కరోనాతో చికిత్స పొందుతుండగా..

కేరళా రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన సీపీఎం యువ నాయకుడు పీ. బిజు(P.Biju) కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన యువజన సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నారు.

news18-telugu
Updated: November 4, 2020, 10:29 AM IST
Corona: కేరళ సీపీఎం యువ నేత కన్నుమూత.. కరోనాతో చికిత్స పొందుతుండగా..
P Biju
  • Share this:
కేరళా రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన సీపీఎం యువ నాయకుడు పీ. బిజు కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన యువజన సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. ఆయనకు కరోనా సోకడంతో తిరువనంతపురం మెడికల్ కళాశాలకు చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. అక్టోబర్ 21న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఆయనకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. శరీరంలోని ఇతర అవయవాల పనితీరుపై సైతం కరోనా ప్రభావం చూపింది.

ఈ నేపథ్యంలో ఆయనకు గుండె పోటు రావడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టీవ్ గా ఉండే బిజు మరణంతో నాయకులు, ఆయన మిత్రులు షాక్ కు గురయ్యారు.  బిజు గతంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కేరళలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అనేక మీడియా చర్చల్లో పాల్గొని తనదైన ముద్ర వేశారు. అనేక సంక్షోభ సమయాల్లోనూ ఆయన పార్టీ తరఫున పోరాడానని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా వైరస్ పూర్తిగా ఎందుకు తగ్గడం లేదన్నది తేలట్లేదు. మరణాల సంఖ్య తగ్గుతున్నప్పుడు డైలీ కేసుల సంఖ్య కూడా తగ్గాలి. కానీ... అలా జరగట్లేదు. ఓ 40 వేల టెస్టులు చేస్తే... దాదాపు 1400 నుంచి 1500 దాకా కొత్త కేసులు వస్తున్నాయి. అంటే ప్రజల్లో వైరస్ వ్యాప్తి తగ్గట్లేదనే అనుకోవచ్చు. తాజాగా నిన్న 45,021 టెస్టులు చెయ్యగా... కొత్త కేసులు 1536 వచ్చాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,42.506కి చేరింది. అలాగే... నిన్న 3 మరణాలు సంభవించడంతో... మొత్తం మరణాల సంఖ్య 1351కి చేరింది.

ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా... దేశంలో అది 1.5 శాతంగా ఉంది. తెలంగాణలో నిన్న కొత్తగా 1421 రికవరీలు వచ్చాయి. చాలా కాలం తర్వాత మళ్లీ రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువ వచ్చాయి. మొత్తం రికవరీల సంఖ్య 223,413కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 92.12 శాతంగా ఉంది. దేశంలో అది 91.7శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17742 యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 14915 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 4, 2020, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading