Home /News /coronavirus-latest-news /

CPIM LEADER SITARAM YECHURY SON ASHISH YECHURI PASSES AWAY DUE TO COVID19 COMPLICATIONS SK

Sitaram Yechury Son died: సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం.. కరోనాతో ఆయన కుమారుడు మృతి

సీతారాం ఏచూరి(ఫైల్ పొటో)

సీతారాం ఏచూరి(ఫైల్ పొటో)

తన కుమారుడి మృతి గురించి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

    దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 05.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

    తన కుమారుడి మృతి గురించి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


    ఆశిష్ ఏచూరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటి నుంచీ సీతారాం ఏచూరితో పాటు కుటుంబ సభ్యులంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కానీ ఆశిష్ మృతితో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆశిష్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona virus, Coronavirus, COVID-19 vaccine, CPM, Sitaram Yechury

    తదుపరి వార్తలు