Covishield: కోవిషీల్డ్ టీకాకు కేంద్రం ప్రభుత్వం ఆర్డర్.. ఒక్క డోస్‌ రేటు ఎంతంటే..

Covishield: కోవిషీల్డ్ టీకాకు కేంద్రం ప్రభుత్వం ఆర్డర్.. ఒక్క డోస్‌ రేటు ఎంతంటే..

కోవిషీల్డ్ వ్యాక్సీన్ (Image:Serum)

Covid Vaccine: తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుంది. పీఎం కేర్స్ నుంచి అందుకోసం నిధులను కేటాయించినట్లు తెలిసింది.

  • Share this:
    మన దేశంలో కరోనా టీకా పంపిణీకి సంబంధించి అంతా సిద్ధమవుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీకాల కొనుగోలుకు సంబంధించి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కు కేంద్రం ప్రభుత్వం టీకాల ఆర్డర్ ఇచ్చింది. కోటి 10 లక్షల డోస్‌లకు ఆర్డర్ వచ్చినట్లు SII వెల్లడిచింది. ఒక్కో డోస్ ధరను రూ.200గా నిర్ణయించారు. ఈ మేరకు SIIతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి అన్ని రాష్ట్రాలకు టీకాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. టీకాల తరలింపు కోసం మహారాష్ట్ర ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పుణె నుంచి దేశం నలుమూలలకూ టీకాలను తరలిస్తున్నారు.


    మన దేశంలో SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి టీకాలను కేంద్రం కొనుగోలు చేస్తోంది. కోవిషీల్డ్ ధర ఖరారు కగా.. కొవాగ్జిన్ ధర ఖరారు కావాల్సి ఉంది. అంతే కొన్ని టీకాలను ఉచితంగా ఇవ్వాలని ఇరు కంపెనీలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుంది. పీఎం కేర్స్ నుంచి అందుకోసం నిధులను కేటాయించినట్లు తెలిసింది. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: