కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. తాజాగా ఇజ్రాయెల్ కూడా తమ వద్ద కోవిడ్ -19 నివారణ కోసం అద్భుతమైన టీకా సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రయత్నాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే ఇజ్రాయిల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (IIBR)సందర్శించారు. అక్కడ ఆయన కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధి, పురోగతిపై ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ష్ముయేల్ షాపిరాతో సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌ని ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని, ఐఐబీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ షపీరా వివరించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఐఐబీర్ ప్రకటించలేదు. భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్‌ని తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఐఐబీఆర్ రక్షణ శాఖతో కలిసి ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది.
IIBR ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ప్రధాన మంత్రి కార్యాలయం సంయుక్త పర్యవేక్షణలో పనిచేస్తుంది. అతి త్వరలోనే వ్యాక్సిన్ మానవ పరీక్షలను ప్రారంభించాలని రక్షణ మంత్రి గాంట్జ్ సంస్థకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Coronavirus, Covid-19