గుడ్‌న్యూస్: కరోనా వ్యాక్సిన్ పేరు ఇదే అంటున్న సైంటిస్టులు...ఎప్పుడు బయటకు వస్తుందంటే...

COVID-19 వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్, ఆక్స్ ఫర్డ్ జెన్నర్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

news18-telugu
Updated: May 4, 2020, 7:26 PM IST
గుడ్‌న్యూస్: కరోనా వ్యాక్సిన్ పేరు ఇదే అంటున్న సైంటిస్టులు...ఎప్పుడు బయటకు వస్తుందంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
COVID-19 వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్, ఆక్స్ ఫర్డ్ జెన్నర్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పేరును ChAdOx1 nCoV-19గా నామకరణం చేశారు. ఇది ఒక అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్ మీద ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. WHO అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 102 ప్రయోగ సంస్థలు టీకా ప్రయోగాలు చేస్తుండగా, వాటిలో ఎనిమిది ప్రముఖ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ స్థాయిలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ కు మరింతగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ఈ సంవత్సరం చివరి నాటికి కరోనాను అరికట్టే వ్యాక్సిన్ రావచ్చని చాలా మంది నిపుణులు ప్రకటించారు. అయితే ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ సంవత్సరం వ్యాక్సిన్ రావడం సాధ్యం కాదంటున్నారు. అయితే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక మహిళకు వ్యాక్సిన్ ఇచ్చి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. అలాగేసెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ రావచ్చని, డిసెంబర్ నాటికి దానిని ప్రపంచానికి ఇవ్వగలిగేంత పరిమాణంలో తయారు చేయవచ్చని విశ్వవిద్యాలయం ఇటీవల వెల్లడించింది.
First published: May 4, 2020, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading