Dog vaccine for Corona: షాకింగ్.. కోవిడ్ టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్‌ వేసిన డాక్టర్లు

Dog vaccine for Corona:  షాకింగ్.. కోవిడ్ టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్‌ వేసిన డాక్టర్లు

ప్రతీకాత్మక చిత్రం

కుక్కల్లోనూ పేగు వ్యాధికి కారణమయ్యే వైరస్‌ను నిరోధించేందుకు కనైన్ వ్యాక్సిన్ ఉపయోగిస్తారని తెలిపింది. కుక్కల టీకాలను కరోనా వ్యాక్సిన్‌గా ఇచ్చిన బృందంలో మునోజ్‌తో పాటు కార్లోస్ పార్డో అనే మరో పశువైద్యుడు కూడా ఉన్నారు

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ల సమర్థతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చిలీ దేశంలో ఇద్దరూ పశు వైద్యులు నిర్వాకం నోరెళ్లబెట్టేలా చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ కు బదుకు కుక్కల వ్యాక్సిన్ (కనైన్ వ్యాక్సిన్)ను వారు ప్రజలకు ఇచ్చారు. దీనిపై చిలీ ఆరోగ్యశాఖ తీవ్రంగా స్పందించింది. అధికారులు వారికి భారీ జరిమానా విధించారు. కోవిడ్‌పై ఈ టీకా సమర్థంగా పనిచేస్తుందని ప్రచారం చేసినందుకు వీరిద్దరిని తీవ్రంగా మందలించారు. కాలామా నగరంలో ఫెర్నాండా మునోజ్ అనే మహిళ ఓ ఏజెన్సీలో పశువైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె సొంతంగా కనైన్ టీకాను తీసుకుంది. కరోనా మహమ్మారిని ఇది నిర్వీర్యం చేస్తుందని ప్రచారం చేస్తూ కొంతమందికి ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చింది.

దీనిపై చిలీ డిప్యూటీ హెల్త్ సెక్రటరీ రోక్సానా డియాజ్ స్పందించారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని.. కనైన్ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రమాదకరమని ఆయన చెప్పారు. కుక్కల వ్యాక్సిన్ మనుషులకు ఇవ్వడం అనైతికమని స్పష్టంచేశారు. ఇది కరోరాను నిర్వీర్యం చేస్తుందనేది అపోహ అన్నారు. ప్రజలందరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఆయన కోరారు. కుక్కల టీకాలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. మరోవైపు ఈ టీకా వాడటం వల్ల తాను ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని మునోజ్ చెప్పారు. ఈ విషయాన్ని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె అంగీకరించింది. అయితే ఈ సంఘటన గతేడాది చిలీలో వ్యాక్సిన్ రాకముందు జరిగినట్టు తెలుస్తోంది.

ఈ గందరగోళం గురించి అమెరికాకు చెందిన వీసీఏ వెటర్నరీ హాస్పిటల్ స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కుక్కల్లోనూ పేగు వ్యాధికి కారణమయ్యే వైరస్‌ను నిరోధించేందుకు కనైన్ వ్యాక్సిన్ ఉపయోగిస్తారని తెలిపింది. కుక్కల టీకాలను కరోనా వ్యాక్సిన్‌గా ఇచ్చిన బృందంలో మునోజ్‌తో పాటు కార్లోస్ పార్డో అనే మరో పశువైద్యుడు కూడా ఉన్నారు. ఆ దేశ ఆరోగ్య శాఖ పార్డోకు 9200 డాలర్లు, మునోజ్‌కు 10,300 డాలర్ల జరిమానా విధించింది. అయితే ఇద్దరూ ఈ జరిమానాపై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. చిలీలో మొత్తం 19 మిలియన్ల జనాభా ఉంది. వీరిలో 7.7 మిలియన్ల మందికి చట్టబద్ధంగా కనీసం ఒక డోసు కోవిడ్ టీకాను అందించారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు