Home /News /coronavirus-latest-news /

COVID19 TELANGANA BODY OF A MAN WHO HAD CORONA WAS DRIVEN TO THE BURIAL GROUND IN A TRACTOR BY DR SRIRAM IN PEDDAPALLI SK

కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించిన డాక్టర్.. వీడియో వైరల్

కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తున్న డాక్టర్

కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తున్న డాక్టర్

ట్రాక్టర్ నడిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో డాక్టర్ శ్రీరామ్ పీపీఈ కిట్ ధరించి ట్రాక్టర్ నడిపారు. మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లి.. అంతక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.

    కరోనా వైరస్ మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. మనిషి అంత్యక్రియలకు ఎంతో గౌరవమిచ్చే మనదేశంలో.. కరోనాతో చనిపోయిన వారి కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు కాదుకదా.. రక్త సంబంధీకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో సాయంతో గుంతల్లో పూడ్చుతున్నారు. చాలా చోట్ల ఇలాంటి ఘటనలే వెలుగుచూస్తున్నాయి. ఐతే పెద్దపల్లిలో మున్సిపల్ సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో.. డాక్టరే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా మారి, కరోనా రోగి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

    పెద్దపల్లిలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా.. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపాలిటీ ట్రాక్టర్‌లో తరలించడానికి ప్రయత్నించారు. అయితే తాను నడపనని, ట్రాక్టర్‌ని అక్కడే వదిలిపెట్టి మున్సిపల్ డ్రైవర్ వెళ్లిపోయాడు. ట్రాక్టర్ నడిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో డాక్టర్ శ్రీరామ్ పీపీఈ కిట్ ధరించి ట్రాక్టర్ నడిపారు. మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లి.. అంతక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. మానవత్వం చాటుకున్న డాక్టర్ శ్రీరామ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సరిలేరు మీకెవ్వరు, మీరు నిజమైన హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

    కోవిడ్ పట్ల ప్రభుత్వాలు, మీడియా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా చాలా మందిలో అపోహలు ఉన్నాయి. కరోనాతో రోగుల మృతదేహాలతో వైరస్ సంక్రమిచందని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నా.. చాలా మంది భయపడుతున్నారు. బంధువులు, స్థానికులుతో పాటు కుటుంబ సభ్యులు కూడా అంతక్రియల్లో పాల్గొనేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో వారి అనుమానాలను పటా పంచలు చేస్తూ.. కోవిడ్ రోగి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించారు డాక్టర్ శ్రీరామ్. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు కాళ్లు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే కరోనాను తరిమికొట్ట వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముందుగా ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Peddapalli, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు