కేరళలో ఒక్కరోజే 12 మందికి కరోనా.. ప్రధాని మోదీకి సీఎం మద్దతు

మార్చి 22న ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి కేరళ ప్రభుత్వ మద్దతిస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

news18-telugu
Updated: March 20, 2020, 8:16 PM IST
కేరళలో ఒక్కరోజే 12 మందికి కరోనా.. ప్రధాని మోదీకి సీఎం మద్దతు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కొత్త పాటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో ఇవాళ ఒక్క రోజే 12 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయినట్లు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఎర్నాకుళంలో 5, కాసర్‌గడ్‌లో 6, పాలక్కడ్ ఒక కేసు నమోదయిందని చెప్పారు. మొత్తంగా కేరళలో కరోనా బాధితుల సంఖ్య 40కి చేరింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడం, ఒకే రోజు 12 కొత్త కేసులు నమోదవడంతో కేరళ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇక మార్చి 22న ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి కేరళ ప్రభుత్వ మద్దతిస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేసి కోవిడ్-19 వైరస్‌ను తరిమికొడదామని పిలుపునిచ్చారు.


కాగా, దేశంలో 223 మందికి కరోనా వైరస్ సోకింది. అత్యధికంగా మహారాష్ట్రలో 52 మందికి వైరస్ సోకగా.. కేరళలో 40 మంది వైరస్ బారినపడ్డారు. మనదేశంలో ఇప్పటి వరకు నలుగురు కరోనా బాధితులు చనిపోయారు. అటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేల మందికిపైగా చనిపోయారు. మరో 2 లక్షల 42 వేల మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: March 20, 2020, 8:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading