హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

అట్లుంటది మనతోని : భారత్ నుంచి కరోనా పరార్

అట్లుంటది మనతోని : భారత్ నుంచి కరోనా పరార్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Cases In India : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 1997 కరోనా వైరస్ కేసులు,9మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,06,460కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,754కు చేరింది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 3908 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,40,47,344 చేరుకుంది. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. గురువారం దేశంలో 2,13,123మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా..ఇప్పటివరకు 89.64కోట్ల మందికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు.

Medical Alert: నాలుగు భారత దగ్గు టానిక్‌లపై WHO మెడికల్ అలర్ట్.. ఆ సిరప్‌లు ఇవే!

దేశంలో ప్రస్తుతం 30,362 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.O7 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో గురువారం 3,97,407 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 218.88 కోట్లకు చేరింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona deaths, Covid cases, Covid-19, Vaccination

ఉత్తమ కథలు