Coronavirus: భారత్‌లో మళ్లీ తగ్గిన కరోనా కొత్త కేసులు.. నేటి కరోనా బులెటిన్ వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

India corona cases: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్త కేసులతో పాటు యాక్టివ్ కేసులు, మరణాలు మరింతగా తగ్గుముఖం పట్టాయి. మరి కొత్తగా ఎన్ని కరోనా కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? ఆ వివరాలను ఇక్కడ చూడండి.

  • Share this:
    indian corona updates, india corona bulletin, covid19 news, corona 3rd phase vaccination, కరోనా వైరస్, ఇండియాలో కరోనా కొత్త కేసులు,
    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 19,740 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 23,070 మంది కోలుకున్నారు. మరో 248 మంది మరణించారు. గత 8 రోజులుగా మనదేశంలో 25వేల లోపే కొత్త కేసులు వస్తున్నాయి. యాక్టివ్ కేసులతో పాటు మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    poonam khetrapal singh on coronavirus, poonam khetrapal singh comments, coronavirus latest news, covid19 latest updates, who on covid19, corona third wave news, కరోనాపై డబ్ల్యూహెచ్‌వో తాజా వ్యాఖ్యలు, పూనమ్ ఖేత్రపాల్ సింగ్
    తాజా కేసులతో కలిపి మన దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కి చేరింది. వీరిలో 3,32,48,291 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 4,50,375 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 2,36,643 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    india corona update, corona bulletin, New Corona Cases, Today Corona Cases, Corona Update Today
    కేరళలోనే అత్యధిక కేసులు వస్తున్నాయి. కేరళలో నిన్న 10,944 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ కేసులు వస్తున్నాయి. అక్కడ 2,620 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)



    నిన్నదేశవ్యాప్తంగా 12,69,291 మందికి కరోనా పరీక్షలుచేశారు. ఇప్పటి వరకు 58.13 లక్షల టెస్ట్‌లు నిర్వహించారు. శనివారం మన దేశంలో 79.12 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. ఇప్పటి వరకు 93.99కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మకచిత్రం)


    రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
    Published by:Shiva Kumar Addula
    First published: