ఖైదీలకు కరోనా వరం.. జైళ్ల 17వేల మంది బయటకు..

ముంబై ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 150 మంది ఖైదీలకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం.

news18-telugu
Updated: May 12, 2020, 5:11 PM IST
ఖైదీలకు కరోనా వరం.. జైళ్ల 17వేల మంది బయటకు..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు వేయికి పైగా కొత్త కేసులు నమోదవడంతో పాటు భారీగా మరణాలు నమోదవుతున్నాయి. వైద్యులు, పోలీస్ సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. అంతేకాదు జైళ్లకు కూడా కోవిడ్ మమమ్మారి పాకింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి 17వేల మంది ఖైదీలను తాత్కాలిక పెరోల్ మీద బయటకు పంపాలని నిర్ణయించింది. త్వరలోనే వారిని జైళ్ల నుంచి విడుదల చేయనున్నారు. ముంబై ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 150 మంది ఖైదీలకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం.

ముంబై ఆర్థర్ రోడ్డు జైలులోని ఖైదీలకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో మిగతా ఖైదీలు బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35వేల మంది ఖైదీల్లో 17 వేల మందిని బయటకు పంపించబోతున్నాం. వీరిలో 5వేల మంది విచారణ ఖైదీతో పాటు 7 ఏళ్ల జైలు శిక్షపడిన ఖైదీలు 5వేలు, 7 ఏళ్లకు పైగా శిక్ష పడిన ఖైదీలు 9వేల మంది ఉన్నారు. ఐతే UAPA, MCOCA, PMLAతో పాటు ఇతర తీవ్రమైన నేరాలుచేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను మాత్రం బయటకు పంపించబోం.
అనిల్ దేశ్‌ముఖ్, మహారాష్ట్ర హోంమంత్రి



కాగా, మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,402 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ 4,786 మంది కోలుకోగా.. 864 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 17,752 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: May 12, 2020, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading