కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజం. టీకా వేయించుకున్నాక చాలా మందికి ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం వస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌లో ఇవి కొన్ని. శరీరంలో రోగ నిరోధక శక్తి(Immunity Power) పెంచుతుందనే సంకేతంతో పాటు కరోనా వైరస్‌తో ఎలా పోరాడాలో శరీరం నేర్చుకునే క్రమంలో ఇలాంటి దుష్ప్రభావాలు వస్తాయి. యితే అమెరికాలోని వేలాది మంది వ్యాక్సిన్(Vaccine) వేయించుకున్నాక తమలో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వ్యాక్సిన్ తయారీదారులు, డాక్టర్లు ఎప్పుడూ హెచ్చరించని ప్రభావాలు వస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా రుతు క్రమాల్లో(పీరియడ్స్‌లో) ఊహించని మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్‌కు, రుతు క్రమం మార్పుల మధ్య గల సంబంధాన్ని ఇంకా నిశితంగా గుర్తించలేదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. కానీ ఈ విషయంలో చాలా మంది ఆందోళన చెందుతూనే ఉన్నారు. అయితే రుతుక్రమంపై కరోనా వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయా లేదా అన్న విషయాన్ని గుర్తించేందుకు సైంటిస్టులు ఇంకా కావాల్సిన సరైన డేటాను సేకరించలేదు.
Covid 19: కోవిడ్‌తో తీవ్ర కిడ్నీ సమస్యలు.. అధ్యయనంలో సంచలన నిజాలు.. హెచ్చరిస్తున్న వైద్యులు..
ఇల్లానోయిస్ అర్బనా ఆంత్రపాలజీ ప్రొఫెసర్ కేట్ క్లాన్సీ, బయోలాజికల్(Biological) అంత్రపాలజిస్ట్ క్యాథీరీన్ లీ.. వ్యాక్సినేషన్(Vaccination) తర్వాత రుతుక్రమంలో మార్పుల విషయంపై అధ్యయనం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత మహిళల రుతుక్రమంలో మార్పులు గమనించామని చెప్పిన లక్షా 40వేల మంది రిపోర్టులను ఇద్దరు పరిశోధకులు సేకరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను లీ, క్లాన్సీ నమోదు చేసుకొని డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. తన అనుభవాన్నే క్యాన్సీ మొదట పొందుపరిచారు. “మొదటి డోసు వ్యాక్సినేషన్ తర్వాత వచ్చిన పీరియడ్ చాలా భారంగా అనిపించింది. నా జీవితంతో అత్యంత క్లిష్టమైనది అనిపించింది” అని పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని వెల్లడించగా.. ఐదు నెలల తర్వాత కూడా చాలా మంది ఆ ట్వీట్‌కు రిప్లేలు ఇస్తున్నారు.
“ఈ ట్వీట్ ఇంత ప్రభావం చూపుతుందని ముందుగా అనుకోలేదు. చాలా ఈ మెయిళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా డైరెక్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా మంది సమస్యలు తెలుపుతున్నారు” అని క్లాన్సీ చెప్పారు. అయితే వ్యక్తిగతంగా చాలా మంది సమస్యలు వెల్లడిస్తున్నప్పటికీ.. పీరియడ్లపై వ్యాక్సిన్ ప్రభావం ఉంటుందా అన్నది నిరూపించేందుకు ఇంత వరకు సరైన శాస్త్రీయమైన ఆధారాలు లేవు. వివిధ కారణాల వల్ల రుతుక్రమం వ్యక్తిని వ్యక్తిని బట్టి.. అలాగే నెలకు నెలకు కూడా మార్పులు చెందుతుంటుంది. ఒత్తిడి కూడా లైటర్, హెవీ పీరియడ్లకు కారణం కావొచ్చు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల అధికారులు, ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆఫీసర్లు.. వ్యాక్సినేషన్ వల్ల పీరియడ్లపై ప్రభావం ఉండదని చెబుతున్నారు.
కొంత కాలమే..
కరోనా వ్యాక్సిన్ల వల్ల ఒకవేళ రుతుక్రమంలో మార్పులు వచ్చినా ఎక్కువ కాలం ఉండవని లీ, క్లాన్సీ సేకరించిన కేసుల్లో తెలుస్తోంది. “మేం గమనించిన విషయాల ప్రకారం, రుతుక్రమంపై పడే ప్రభావం తక్కు కాలమే ఉంటుంది. ఓ రెండు పీరియడ్ల వరకు ఎఫెక్ట్ ఉంటుంది” అని లీ చెప్పారు. తాము కరోనా వ్యాక్సిన్లకు మద్దతు ఇస్తామని, అయితే రుతుక్రమంపై ప్రభావాన్ని గుర్తించి పరిష్కరించాలనే తమ ఉద్దేశమని ఇద్దరు పరిశోధకులు చెప్పారు. రుతుక్రమం.. వ్యక్తికి.. వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వాటిపై వ్యాక్సిన్ ప్రభావం గురించి పరిశోధన చేయడం కష్టమని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ గైనకాలజిస్ట్ డాక్టర్ లారా రిలే అభిప్రాయపడ్డారు.
మానసిక ఒత్తిడి, స్వల్ప అనారోగ్యాలు సహ మరికొన్ని విషయాలు కూడా పీరియడ్స్‌పై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో కరోనా వ్యాక్సిన్లు, మందుల ట్రయల్స్ జరిగే సమయంలో రుతుక్రమంపై ప్రభావం విషయాన్ని దృష్టి ఉంచుకుంటారని ఆశిస్తున్నట్టు డాక్టర్ రిలే చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Corona vaccination centres, Covid -19 pandemic