• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • COVID VACCINATION THERE NO NEED TO GET THIRD DOSE OF VACCINE SERUM SII CEO ADAR POONAWALA INTERESTING COMMENTS SK

Network 18 Sanjeevani: కరోనా వ్యాక్సీన్ మూడో డోస్‌ అవసరమా? సీరం సీఈవో కీలక వ్యాఖ్యలు

Network 18 Sanjeevani: కరోనా వ్యాక్సీన్ మూడో డోస్‌ అవసరమా? సీరం సీఈవో కీలక వ్యాఖ్యలు

ఆదార్ పూనవల్లా (File image - courtesy - twitter)

Network 18 & Federal Bank's Initiative Sanjeevani: నెట్ వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్‌ కలిసి సంజీవని కార్యక్రమం ప్రారంభించాయి. వ్యాక్సిన్‌ గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి.. అపోహలను తొలగించేందుకు ఈ క్యాంపెయిన్ చేపట్టారు.

  • Share this:
    మన దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఐతే ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న అపోహలతో భయపడుతున్నారు. ఈ నేపథ్యలో వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. నెట్ వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్‌ల సంయుక్త భాగస్వామ్యంలో "సంజీవని ఎ షాట్ ఆఫ్ లైఫ్" కార్యక్రమాన్నితలపెట్టాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌లోని అట్టారీ బోర్డర్‌లో జరిగిన ఈ  కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం కెప్టెన అమరీందర్ సింగ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్ సింగ్ సిధు, సీఎన్ఎన్ చీఫ్ మెడికల్ కరెస్పాండెంట్ డాక్టర్. సంజయ్ గుప్తా, సినీ నటుడు సోనూసూద్ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మాట్లాడిన సీరం సీఈవో అదార్ పూనావల్లా.. కరోనా వ్యాక్సిన్ మూడో డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఒక్కొక్కరికి రెండో కరోనా టీకా డోస్‌లు ఇస్తున్నారు. మొదటి డోస్ వేసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ వేస్తారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఐతే కొన్ని వ్యాధులకు బూస్టర్  డోస్ కూడా ఇస్తారని.. కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ మూడో డోస్ సాధ్యాసాధ్యాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఐతే ఇప్పటి వరకు అధికారికంగా  ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పూనావల్లా వెల్లడించారు.

    ''బూస్టర్ షాట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. కొన్ని వ్యాక్సిన్‌లకు మూడో డోస్ అవసరం ఉంటుంది. కానీ మా వ్యాక్సిన్ విషయంలో ఆ అవసరం లేదు. మరింత అధ్యయనం తర్వాత ఆరు నెలల్లో మూడో డోస్ సాధ్యాసాధ్యాలపై దృష్టి పెడతాం. మూడో డేస్ వేసుకుంటే దీర్ఘకాలం పాటు కరోనా వ్యాధి నుంచి రక్షణ కల్పించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదు.'' అని అదార్ పూనావల్లా పేర్కొన్నారు.

    మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన సందర్భంగా ..నెట్ వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్‌ కలిసి సంజీవని కార్యక్రమం ప్రారంభించాయి. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా మన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న అమృత్‌సర్, ఇండోర్, నాసిక్, గుంటూరు, దక్షిణ కన్నడ ప్రాంతాలను దత్తత తీసుకొని అక్కడ వివిధ గ్రామాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహించనున్నారు. ముందుగా అమృత్‌సర్ నుంచి ప్రారంభించి తర్వాత ఇండోర్, నాసిక్, గుంటూరు, దక్షిణ కన్నడను కవర్ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు సంజీవని గాడీ అనే వాహనాన్ని ప్రారంభించారు. ఇది ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ అపోహలను తొలగిస్తూ... గ్రామస్థుల్లో కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న సందేహాలకు సమాధానాలు అందిస్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: