HOME »NEWS »Corona vilayatandavam »covid vaccination pm narendra modi and cms likely to get vaccine in second phase sk

PM Narendra Modi: కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

PM Narendra Modi: కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
ప్రధాని నరేంద్ర మోడీ (Image credit - twitter)

నేతలు ఎప్పుడు టీకా వేసుకోవాలన్న దానిపై.. జనవరి 11న సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. టీకా కోసం ఎగబడకూడదని.. మీ వంతు వచ్చినప్పుడే వ్యాక్సిన్ వేసుకోవాలని ఇప్పటికే ఆయన రాజకీయ నేతలకు సూచించారు.

  • Share this:
    మన దేశంలో తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేస్తున్నారు. ఐతే ప్రధాని మోదీ ఎప్పుడు టీకా వేసుకుంటారని ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజల్లో అవగాహ కల్పించడంతో పాటు భయం పోగొట్టేందుకు పలు దేశాల్లో అధ్యక్షులు, ప్రధాన మంత్రులే ముందుగా టీకా వేసుకుంటున్నారని.. మరి మోదీ ఎందుకు వేసుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఎప్పుడు టీకా వేసుకుంటారన్న ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఓ సమాధానం వచ్చిది. రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రధాని మోదీ టీకా తీసుకుంటారని పీఎంవో అధికారి ఒకరు వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

    ఆ కథనం ప్రకారం.. రెండో దశ వాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు టీకా వేసుకోనున్నారు. ఇది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఆ డ్రైవ్‌లో సుమారు 27 కోట్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో పాటు చాలా మంది సీఎంలు, మంత్రులు, ఎంపీలు.. అదే ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. నేతలు ఎప్పుడు టీకా వేసుకోవాలన్న దానిపై.. జనవరి 11న సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. టీకా కోసం ఎగబడకూడదని.. మీ వంతు వచ్చినప్పుడే వ్యాక్సిన్ వేసుకోవాలని ఇప్పటికే ఆయన రాజకీయ నేతలకు సూచించారు.



    ప్రస్తుతం మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ (Covishield), భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కొవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్‌లను వినియోగిస్తున్నారు. ఈ రెండు వాక్సిన్‌లను డీసీజీఐ (DCGI) ఆమోద ముద్రవేయడంతో.. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ఇది ప్రపంచలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. అన్ని రాష్ట్రాల్లో తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొసాగుతోంది. ఈ దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే టీకా వేసుకున్న వారిలో కొంత దుష్ప్రభవాలు కనిపిస్తున్నాయి. జ్వరం, తలనొప్పితో పాటు ఇతర చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ సాధారణమేనని.. ఎవరూ ఆందోళలన చెందాల్సిన అవసరం లేదని సదరు సంస్థలు వెల్లడించాయి.

    ఇక మనదేశంలో టీకాలు వేస్తూనే.. ఇరుగుపొరుగు దేశాలకు కూడా భారత్ సాయం చేస్తోంది. కష్టకాలంలో సుహృద్భావంతో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, సీషెల్స్ దేశాలకు టీకాను ఉచితంగానే అందజేస్తోంది. పలు పలు టీకాలను భూటాన్, బంగ్లాదేశ్‌కు తరలించింది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయనున్నారు. త్వరలోనే కోవిషీల్డ్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది. అనంతరం మన దేశం నుంచి ఆఫ్రికా సహా పలు పేద, చిన్న దేశాలకు వ్యాక్సిన్‌లు ఎగుమతి కానున్నాయి. ఇతర వ్యాక్సిన్లతో పోల్చితే ధర తక్కువగా ఉండడం, సమర్థవంతంగా పనిచేయడం, 2 నుంచి 8 ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేసుకునే అవకాశం ఉండడంతో.. చాలా దేశాలు భారతీయ టీకాల కోసం ముందుకొస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:January 21, 2021, 14:03 IST