హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందా..?

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని, ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతోందన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి.

  కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తెలిసిందే. అయితే వ్యాక్సిన్లకు సంబంధించి జరుగుతున్న కొన్ని ప్రచారాలు ఆందోళ రేకెత్తిస్తున్నాయి. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని, ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతోందన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే తాజా పరిశోధనలు ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని నిర్ధారించాయి. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి వ్యాక్సిన్లు ఏ మాత్రం హాని కలిగించవని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని University of Miami పరిశోధకులు ఈ అద్యయనం నిర్వహించారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 45 మందిపై ఈ అధ్యయనం జరిపారు. వ్యాక్సిన్ తీసుకోకముందు, తీసుకున్న తర్వాత వారిపై పరీక్షలు నిర్వహించారు.

  వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వారిలో సంతానోత్పతి సామర్థ్యం తగ్గలేదని పరిశోధకులు తేల్చారు. ఈ పరీక్షలను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించినట్టు చెప్పారు. వీర్యం పరిమాణం, గాఢత, వీర్యకణాల చలనశీలత వంటి అంశాలను పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత లైంగిక సామ‌ర్థ్య ప‌రీక్షలో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైజ‌ర్(BNT162b2) టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు టీకాల‌ను ఎంఆర్ఎన్ఏ విధానంలో త‌యారు చేసినవేకాగా, ఆ వ్యక్తుల వీర్యక‌ణాల్లో బేస్‌లైన్ స్పెర్మ్ కాన్‌సెంట్రేష‌న్‌, టోట‌ల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియ‌న్లు/ఎంఎల్‌, 36 మిలియ‌న్లు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది.

  ఇవి కూడా చదవండి: వేరే కులం వ్యక్తిని ప్రేమించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు..

  TV Actress Arrest: ప్రముఖ టీవీ షోలలో నటిస్తున్న ఇద్దరు నటీమణుల అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక..

  ఇక రెండో డోసు తర్వాత వారిలో వీర్యక‌ణాల సంఖ్య స్వల్పంగా 30 మిలియ‌న్లు/ఎంఎల్, టోట‌ల్ కౌంట్ 44 మిలియ‌న్లకు పెరిగింది. టీకా తీసుకున్న త‌ర్వాత ఎంత ప‌రిమాణంలో వీర్యం ఉత్పత్తి అవుతున్నది, వీర్యక‌ణాలు దూసుకెళ్లుతున్న తీరు ఎలా ఉందో ఈ స్టడీ ద్వారా నిర్ధారించారు. రెండు డోసులు పూర్తయ్యాక వారిలో వీర్యకణాల సంఖ్య, చలనశీలత కొంతమేరకు మెరుగైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లలో ఎంఆర్‌ఎన్‌ఏ ఉంటుందని.. అవి వీర్యంపై ప్రభావం చూపే అవకాశం లేదని పరిశోధకులు చెప్పారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Covid vaccine, Covid-19, Infertility, Pfizer Vaccine

  ఉత్తమ కథలు