ఏంటీ ఘోరం.. శ్మశాన వాటిక ముందు మృతదేహాలతో క్యూ.. కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు

ఏంటీ ఘోరం.. శ్మశాన వాటిక ముందు మృతదేహాలతో క్యూ.. కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు

హిండన్ శ్మశాన వాటిక ముందు మృతదేహాలు

ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. హండన్ శ్మశాన వాటిక ముందు భారీ సంఖ్యలో మృతదేహాలు పడిఉన్నాయి. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  భారత్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతి రోజు లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. మన దేశంలో పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఊహకందని విధంగా కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. చికిత్సకు బెడ్స్ కూడా దొరకడం లేదు. చివరకు కరోనా మృతులతో శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. హండన్ శ్మశాన వాటిక ముందు భారీ సంఖ్యలో మృతదేహాలు పడిఉన్నాయి. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.

  కరోనా విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దహన సంస్కారాలపైనా ఆంక్షు విధించారు. శ్మశాన వాటికలో ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే దహన సంస్కారాలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో.. ఆ మృతదేహాలతో శ్మశాన వాటిక ముందు బంధువులు పడిగాపులు గాస్తున్నారు. హిండన్ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో క్యూకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  ఐతే శుక్రవారం భారీ సంఖ్యలో మృతదేహాలు రావడంతో వాటిని శ్మశాన వాటిక బయటే నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ఈ షాకింగ్ దృశ్యాలను నెటిజన్లు చలించిపోతున్నారు. మన దేశానికి ఏంటీ దుస్థితి అని బాధపడుతున్నారు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ఘజియాబాద్‌లో మాత్రమే కాదు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా అంబులెన్స్‌ల శబ్ధాలే వినిపిస్తున్నాయి. ఆస్పత్రులన్నీ కోవిడ్ రోగులతో నిండిపోయాయి. అంబులెన్స్‌లు పెద్ద మొత్తంలో శ్మశాన వాటికలకు క్యూ కడుతున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు