హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

RTPCR Validity: నిమిషం ఆలస్యంగా వచ్చిందని.. గర్భిణీకి విమానంలోకి నో ఎంట్రీ..

RTPCR Validity: నిమిషం ఆలస్యంగా వచ్చిందని.. గర్భిణీకి విమానంలోకి నో ఎంట్రీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ కుటుంబానికి బెంగళూరు విమానాశ్రయంలో చేదు ఘటన ఎదురైంది. ఒక్క నిమిషం తేడాతో ఆర్టీపీసీఆర్ వ్యాలిడిటీ ముగిసిందనే నెపంతో విమాన ప్రయాణానికి సిబ్బంది వారిని అనుమతించలేదు. 48 గంటల కాలపరిమితి ముగిసి ఒక్క నిమిషమైందని సిబ్బంది వారి ప్రయాణానికి నిరాకరించారు.

ఇంకా చదవండి ...

కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల ప్రస్తుతం ప్రయాణాల్లో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. విమాన ప్రయాణాలకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ చాలా దేశాలు మార్గనిర్దేశాలు జారీ చేశాయి. అంతేకాకుండా ఆ ఆర్టీపీసీఆర్ టెస్టు 48 గంటలకు మించకుండా ఉండేలా నిబంధనలు విధించాయి. ఈ నిబంధనే ఇప్పుడు ప్రయాణికులకు ఇక్కట్లు తీసుకొస్తోంది. తాజాగా ఓ కుటుంబానికి బెంగళూరు విమానాశ్రయంలో చేదు ఘటన ఎదురైంది. ఒక్క నిమిషం తేడాతో ఆర్టీపీసీఆర్ వ్యాలిడిటీ ముగిసిందనే నెపంతో విమాన ప్రయాణానికి సిబ్బంది వారిని అనుమతించలేదు. 48 గంటల కాలపరిమితి ముగిసి ఒక్క నిమిషమైందని సిబ్బంది వారి ప్రయాణానికి నిరాకరించారు.

వివరాల్లోకి వెళ్తే.. రుక్సార్ మెమన్(28) ఆమె భర్త సుహైల్ సయ్యద్(39), అతని తల్లి ముంతాజ్ మన్వార్(63) ముగ్గురూ ఈ అక్టోబరు 9న దుబాయ్ నుంచి సెలవుల నిమిత్తం బెంగళూరులోని తమ స్వగృహానికి వచ్చారు. మంగళవారం ఉదయం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇండిగో ఫ్లైట్ 6E 95లో మధ్యాహ్నం 1.15కు బోర్డింగ్ చేయాల్సి ఉంది. ప్రీ-డిపార్చర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ముగ్గురు రూ.9వేలు ఖర్చు చేసి ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇండిగో చెకిన్ కౌంటర్ కు వెళ్లగా.. వారికి ఈ ఒక్క నిమిషం గడువు సంగతి తెలిసింది.

"మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మేము ఇండిగో విమానంలో బోర్డింగ్ కావాల్సి ఉంది. అయితే మమ్మల్ని బోర్డింగ్ కు నిరాకరించారు. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ కు ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులను చూపించాం. శాంపిల్ కలెక్షన్ వ్యాలిడిటీ పీరియడ్ 48 గంటల ఒక్క నిమిషంతో పూర్తయిందని అనుమతించలేదు.ఆ టెస్టును ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు చేయించుకున్నాం." అని సుహైల్ మెమన్ అన్నారు.

ఈ విషయంపై ఎంత బ్రతిమాలినా ఒప్పుకోలేదని, ఎయిర్ లైన్ మేనేజర్ తమతో కఠినంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. మూడు గంటలసేపు వేచి ఉండేలా చేయించి చివరకు బోర్డింగ్ కు నిరాకరించారని ఆయన వాపోయారు. సుహైల్ భార్య రుక్సార్ గర్భంతో ఉందని చెప్పి అనుమతి కోరినా సిబ్బంది ఒప్పుకోలేదన్నారు.

ఈ విషయంపై సదరు ఎయిర్ లైన్ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. అయితే తాము కోవిడ్ నిబంధనలు పాటించామని, వారికి ఎంతో గౌరవపూర్వకంగా చెప్పామని.. డబ్బు కోల్పోయామనే బాధతో వారు ఈ విధంగా ప్రతిస్పందిస్తున్నారని విమాన సంస్థ సిబ్బంది చెబుతున్నారు.

యూఏఈకి వెళ్లే ప్రతి భారతీయ ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగానే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. అందులో నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఈ రిపోర్టుకు 48 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. అంతకుమించితే ప్రయాణానికి అనుమతించరు.

First published:

Tags: Corona test, Flight

ఉత్తమ కథలు