Telangana: తెలంగాణలో కరోనావైరస్ కేసులు తగ్గడానికి అసలు కారణం ఇదే..

ఎంపీ రేవంత్ రెడ్డి (ఫైల్)

ఏప్రిల్ నెలాఖరు నుంచి వరుసగా కరోనా పరీక్షలు తగ్గుతూ వస్తున్నాయి. ఆర్టీపీసీర్ టెస్ట్‌లతో పాటు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కూడా తగ్గింది. మే 9న 55,358 పరీక్షలు మాత్రమే నిర్వహించారు.

  • Share this:
    తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏప్రిల్ 27 వరకు ప్రతి రోజూ10వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాతి నుంచి వరుసగా తగ్గముఖం పడుతూ వస్తున్నాయి. నేడు 4976 కేసులు వచ్చాయి. అంటే సగానికి పైగా పడిపోయాయి. ఈ లెక్కన తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గిందని భావించవచ్చు.  ఐతే ఇక్కడే అసలు విషయాన్ని వెల్లడించారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో కరోనా తగ్గలేదని..ప్రభుత్వమే తగ్గించి చూపిస్తోందని విమర్శించారు. కరోనా టెస్ట్‌లు పెంచితే ఎక్కువ కేసులు బయటపడతాయని.. కానీ పరీక్షల సంఖ్య అమాంతం తగ్గించడం వల్లే, కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.

    తెలంగాణలో ఆదివారం కేవలం 55వేల కరోనా పరీక్షలు చేశారని.. తెలంగాణ కరోనా వ్యాప్తిని సీఎం కేసీఆర్ ఇలా తగ్గిస్తున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.



    గత నెలాఖరులో ప్రతి రోజు దాదాపు లక్ష వరకు కరోనా పరీక్షలు చేశారు. ఏప్రిల్ 26న 99,638 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఆ రోజు 10వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
    ఏప్రిల్ 26 కరోనా బులెటిన్


    ఏప్రిల్ నెలాఖరు నుంచి వరుసగా కరోనా పరీక్షలు తగ్గుతూ వస్తున్నాయి. ఆర్టీపీసీర్ టెస్ట్‌లతో పాటు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కూడా తగ్గింది. మే 9న 55,358 పరీక్షలు మాత్రమే నిర్వహించారు. అందుకే కేసుల సంఖ్య తక్కువగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో ఆదివారం 4976 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 7646 మంది కోలుకోగా.. మరో 35 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా నుంచి 4,28,865 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 2739 మంది మరణించారు.

    తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా నుంచి 4,28,865 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 2739 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 65,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 55,358 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,36,13,004 పరీక్షలు నిర్వహించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: