Home /News /coronavirus-latest-news /

COVID CASES AND DEATHS RISE IN USA PVN 2

Covid Cases Rise In USA : అమెరికాలో కోవిడ్ సునామీ..భారీగా కేసులు,మరణాలు..మరో ముప్పు తప్పదా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid Cases Rise In USA : అమెరికాలో మళ్లీ కరోనా(Corona) విజృంభిస్తోంది. అమెరికాలో(USA)మంగళవారం 72,312 కొత్త కోవిడ్ కేసులు(Covid Cases) నమోదుకాగా,279 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సాస్, ప్లోరిడా,న్యూయార్క్ రాష్ట్రాలో నమోదయ్యాయి.

ఇంకా చదవండి ...
Covid Cases Rise In USA : అమెరికాలో మళ్లీ కరోనా(Corona) విజృంభిస్తోంది. అమెరికాలో(USA)మంగళవారం 72,312 కొత్త కోవిడ్ కేసులు(Covid Cases) నమోదుకాగా,279 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సాస్, ప్లోరిడా,న్యూయార్క్ రాష్ట్రాలో నమోదయ్యాయి. కాలిఫోర్నియాలో అత్యధికంగా 14,415 కొత్త కేసులు నమోదుకాగా,ఆ తర్వాత ఫ్లోరిడాలో 9,779 కేసులు,టెక్సాస్ లో 6,818 కేసులు,న్యూయార్క్ లో 3,972 కేసులు నమోదయ్యాయి. ఇక,మరణాలు(Covid Deaths)అత్యధికంగాన్యూయార్క్(51),కాలిఫోర్నియా(29),మసాచుసెట్స్(26),ఇల్లినాయిస్(24),న్యూజెర్సీ(20) నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8 కోట్ల 75లక్షల 49వేల 563 చేరగా..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 36వేల 483కి చేరింది.

మరోవైపు,తైవాన్,బ్రెజిల్,జర్మనీ,ఫ్రాన్స్ దేశాల్లో కూడా కోవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి. జర్మనీలో 83వేల కేసులు,తైవాన్ లో 66వేల కేసులు,ఫ్రాన్స్ లో 65వేల కేసులు,బ్రెజిల్ లో 40వేల కొత్త కేసులు నమోదయ్యాయి.



Air Pollution : భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్..ఢిల్లీలో ఉండేవాళ్లకైతే 10 ఏళ్లు!

ఇక,భారత్(India)లో కూడా కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,822 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 5,718 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 2956 మందికి పాజిటివ్‌ రాగా, కేరళలో 1989, ఢిల్లీలో 1118, కర్ణాటకలో 594, హర్యానాలో 430 చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 4,32,45,517..మొత్తం మరణాల సంఖ్య 5,24,792కి చేరింది. 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది. భారత్​లో మంగళవారం 13,58,607 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,50,87,271 కోట్లకు చేరింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid cases, Covid situation, India, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు