Covid In USA : అమెరికాలో మళ్లీ కోవిడ్ విజృంభణ..భారీగా కేసులు,మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
Covid Cases Rise In USA : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. అమెరికాలో సోమవారం 49వేల 422 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా,117 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఎక్కువగా టెక్సాస్;ప్లోరిడా,న్యూయార్క్ రాష్ట్రాలో నమోదయ్యాయి.
Covid Cases Rise In USA : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా(Corona) విజృంభిస్తోంది. అమెరికాలో(USA) సోమవారం 49వేల 422 కొత్త కోవిడ్ కేసులు(Covid Cases) నమోదుకాగా,117 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఎక్కువగా టెక్సాస్;ప్లోరిడా,న్యూయార్క్ రాష్ట్రాలో నమోదయ్యాయి. న్యూయార్క్ లో అత్యధికంగా 7,811 కొత్త కేసులు నమోదుకాగా,ఆ తర్వాత టెక్సాస్ లో 7,560 కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో 7,197 కేసులు,కాలిఫోర్నియాలో 2,998 కేసులు,ఇల్లినాయిస్ లో2,071కేసులు,న్యూజెర్సీలో 979 కేసులు,వర్జీనియాలో 1,761 కేసులు,మసాచుసెట్స్ లో 1,442 కేసులు,ఇండియానాలో 1,199కేసులు,విస్కాన్సిన్ లో 1,043 కేసులు,వాషింగ్టన్ లో 1,948 కేసులు,మిన్నిసోటాలో 1,549 కేసులు నమోదయ్యాయి. ఇక,మరణాలు అత్యధికంగా న్యూయార్క్(45)లో నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8 కోట్ల 74లక్షల 24వేల 846కి చేరగా..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 36వేల 84కి చేరింది.
మరోవైపు,తైవాన్,బ్రెజిల్,జర్మనీ దేశాల్లో కూడా కోవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి. తైవాన్ లో 45వేల కేసులు,జర్మనీలో 38వేల కేసులు,బ్రెజిల్ లో 40వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు,భారత్ లో రోజువారీ కరోనా కేసులు (India Covid Cases)భారీగా తగ్గాయి. గడిచిన మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు 6,594కు పడిపోయాయి. దేశంలో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కోవిడ్ తో మృతిచెందారు.
కాగా, గత 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారని, 3,21,873 మందికి కరోనా పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటిరకు మొత్తంగా 85.54 కోట్ల కరోనా పరీక్షలు చేశామని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.12 శాతానికి చేరాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 కు చేరినట్లు తెలిపింది. సోమవారం 14,65,182 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 195,35,70,360 కోట్లకు చేరినట్లు తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.