హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Donald Trump: ట్రంప్ తీవ్ర అనారోగ్యానికి గురైతే.. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా?

Donald Trump: ట్రంప్ తీవ్ర అనారోగ్యానికి గురైతే.. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా?

డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

ఎన్నికల తేదీని మార్చే హక్కు అమెరికా చట్ట సభ్యులకు ఉంటుంది. అయితే అధ్యక్షుడికి మాత్రం ఉండదు. ఎన్నికల తేదీని మార్చాలంటే కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ మెజార్టీ సభ్యుల ఆమోదం ఉండాలి.

కోవిడ్-19.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్రమాదకర వైరస్. ఇప్పటికే మిలియన్ల మంది దీని బారిన పడి మృత్యు ఒడికి చేరారు. లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఇందుకు దేశాధినేతలు మినహాయింపు కాదు. ఇప్పటికే వివిధ దేశాల నాయకులకు ఈ ప్రమాదకర వైరస్ బారిన పడి కోలుకున్నారు. మరి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పదవీలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చట్ట సభ్యులు వద్ద ఎలాంటి ఆప్షన్ ఉంది? పాలనా పరంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మరి వీటికి సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం.

25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది..?

ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అమెరికా రాజ్యాంగానికి ఇప్పటి వరకు చేసింది 27 సవరణలే. అంతా కఠినమైన రాజ్యాగంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులోని 25వ రాజ్యాంగ సవరణ ప్రకారం అధ్యక్షుడు తన విధులను నిర్వర్తించలేని పక్షంలో ఉపాధ్యక్షుడు ఆ పదవీని చేపడతారు. దీని ప్రకారం డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడినట్లయితే ఉపాధ్యాక్షుడు మైక్ పెన్స్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం వరుసగా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, రిప్లబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించేందుకు అర్హులు.

25వ రాజ్యాంగ సవరణను 60వ దశకంలో తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బారినట్లయితే ఆయన తన విధులు నిర్వర్తించలేరని తెలుసుకోవాలి. ఈ సందర్భంలో ఆయన ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ, సెనేటర్ గ్రాస్లేకీ రాతపూర్వకంగా ఓ లేఖ ద్వారా సమాచారమివ్వాలి. తాను విధులు నిర్వహించలేనని ఉపాధ్యక్షుడను యాక్టింగ్ ప్రెసిడెంట్ గా సేవ చేయాలనే పాయింట్ ను ఆ లేఖలో పొందుపరిచాలి. కోలుకున్న తర్వాత.. తాను విధులు నిర్వహించగలనని మరో లేఖను కాంగ్రెస్ కు పంపాలి.

లేఖను స్వయంగా ట్రంప్ పంపించలేకపోతే ఏం జరుగుతుంది?

అప్పుడు అధ్యక్ష బాధ్యతలను మిస్టర్ పెన్స్‌కు  చేపట్టాల్సి ఉంటుంది.   ట్రంప్ క్యాబినెట్ నాయకులలో ఎక్కువ మంది.. మిస్టర్ పెన్స్ వెంటనే యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతున్నారని చెప్పడానికి ఈ బృందం..పెలోసి, గ్రాస్లీకి రాత పూర్వకంగా లేఖ రాస్తుంది. అనంతరం ట్రంప్ కోలుకున్నాక చట్ట సభ్యులకు మరో లేఖ రాయల్సి ఉంటుంది. ఇందుకు పెన్స్ అంగీకరించకపోతే ట్రంప్ బాధ్యతను స్వీకరించేందుకు సరిపోతారా లేదా అనే అంశంపై కాంగ్రెస్ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

ఎన్నికలు వాయిదాపడతాయా?

ట్రంప్ కరోనా బారిన పడటం వల్ల క్వారంటీన్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారి ప్రచారాల్లో ఆటంకం ఏర్పడుతుంది. అయితే ఎన్నికలు ఆలస్యమవుతాయా అనేది అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. అమెరికా చట్టాల ప్రకారం నాలుగేళ్లకొకసారి నవంబరు మొదటి సోమవారం తర్వాత మంగళవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఈ ఏడాది నవంబరు 3న ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే ఎన్నికల తేదీని మార్చే హక్కు అమెరికా చట్ట సభ్యులకు ఉంటుంది. అయితే అధ్యక్షుడికి మాత్రం ఉండదు.

ఎన్నికల తేదీని మార్చాలంటే కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ మెజార్టీ సభ్యుల ఆమోదం ఉండాలి. అంతేకాకుండా డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల అంగీకారం కూడా ఉండాలి. కాబట్టి తేదీని మార్చడం కష్టం కావచ్చు. ఒకవేళ ఎన్నికలు వాయిదా పడినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వ పాలన అయినా నాలుగేళ్లు మాత్రమే కొనసాగాలి. దీన్ని బట్టి 2021 జనవరి 20 మధ్యాహానికల్లా ట్రంప్ అధ్యక్ష పదవీ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఎన్నికల తేదీని మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం అమెరికా చట్ట సభ సభ్యుల్లో 2/3 వంతు ఆమోదించాలి. తర్వాత మూడొంతుల అమెరికా రాష్టాలు అంగీకరించాలి. ఇది కూడా అసాధ్యంగా అనిపిస్తోంది.

గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?

1985లో అప్పటి అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగర్ క్యాన్సర్ కారణంగా ఆసుపత్రిలో చేరగా.. ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ తాత్కాలిక పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2002, 2007లో అధ్యక్షుడు జార్జ్ బుష్ కోలోనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న కాలంలో కూడా ఆయన ఉపాధ్యక్షుడు తాత్కాలిక పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో 1912 అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి వారాల్లో 84 నిమిషాల ప్రసంగం పూర్తి చేసిన తర్వాత టెడ్డి రూజ్వెల్ట్ ను కొంతమంది దుండగులు తుపాకులతో కాల్చారు. అప్పుడు ఆయన ప్రచారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో స్థానంలో నిలిచిన ప్రొగ్రెసివ్ పార్టీ అభ్యర్థి రేసులో నిలిచారు.

అదే ఎన్నికల్లో రిపబ్లికన్ ఉపాధ్యక్షుడు జేమ్స్ షెర్మాన్, అధ్యక్షుడు విలియం హోవార్డ్ టాఫ్ట్ తిరిగి ఎన్నికలకు సిద్ధమయ్యే కొద్ది రోజుల ముందు మరణించారు. రిపబ్లికన్ అధికారులకు ఎన్నికల రోజుకు ముందు భర్తీ చేయడానికి తగినంత సమయం లేదు. ఎన్నికల్లో టాఫ్ట్ చివరికి ఓడిపోయాడు. డెమొక్రాట్ అభ్యర్థి వుడ్రో విల్సన్ అధ్యక్షుడయ్యాడు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coronavirus, Covid-19, Donald trump, US Elections 2020

ఉత్తమ కథలు