హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Corona Tension: ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్న ఆల్ఫా వేరియంట్.. మూగ జీవాలనూ వదలని వైరస్

Corona Tension: ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్న ఆల్ఫా వేరియంట్.. మూగ జీవాలనూ వదలని వైరస్

దాన్ని ఇండోనేషియాలోని బాలిలో ఓ వీధి కుక్క. ఆ కుక్క చిన్న పిల్లలా ఉన్నప్పుడే దాన్ని పెంచుకోవడానికి తమ వెంట తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే ఆస్ట్రేలియాకు పెట్ డాగ్స్ను తీసుకొచ్చేందుకు అనుమతి లభించకపోవడంతో దాన్ని సింగపూర్ నుంచి న్యూజిలాండ్కు పంపించారు.

దాన్ని ఇండోనేషియాలోని బాలిలో ఓ వీధి కుక్క. ఆ కుక్క చిన్న పిల్లలా ఉన్నప్పుడే దాన్ని పెంచుకోవడానికి తమ వెంట తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే ఆస్ట్రేలియాకు పెట్ డాగ్స్ను తీసుకొచ్చేందుకు అనుమతి లభించకపోవడంతో దాన్ని సింగపూర్ నుంచి న్యూజిలాండ్కు పంపించారు.

Corona Tension: ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉంది కరోనా వైరస్.. అయితే కేవలం మనుషులనే కాదు.. జంతువులను కూడా భయపెడుతోంది. కొత్త కొత్త వేరియంట్లు వచ్చి పడుతున్నాయి. మళ్లీ మహమ్మారి దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు అందడం కలవర పెడుతోంది.

ఇంకా చదవండి ...

Corona Tension: ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ (Corona Second Wave) కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వేరియంట్లు దాడి చేస్తున్నాయి. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతునే ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ (Corona Virus)కేవలం మనుషులనే కాకుండా మూగ జీవాలకు సైతం సోకుతోంది. తాజాగా పెంపుడు జంతువుల్లో ఆల్ఫా వేరియంట్‌ (Alpha Variant) కనుగొన్నట్లు లండన్‌ పరిశోధకులు నిర్ధారించారు. వెటర్నరీ రికార్డ్ జర్నల్ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ (RTPCR TEST)ద్వారా రెండు పిల్లులు, ఓ కుక్కలో SARS-CoV-2 అల్ఫా వేరియంట్‌ను గుర్తించారు. వాటి గుండెపై తీవ్ర ప్రభావం కనిపించిదని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ పెంపుడు జంతువులకు కరోనా సోకడానికి కొన్ని వారాల మందు వాటి యజమానులకు కరోనా సోకినట్లు పరిశోధనల్లో తేలింది. గతంలో జంతువుల్లో గుర్తించిన వైరస్‌ కంటే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అత్యధిక శాతం జంతువులు మనుషులతో సన్నిహితంగా ఉండడం వల్లే వైరస్‌ సోకినట్లు నిపుణులు గుర్తించారు.

జంతువుల్లో కరోనా సోకడం అనేది అరుదుగా ఉంటుందని, జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సోకే అవకాశాల కంటే మనుషుల నుంచి జంతువులకు వైరస్‌ సంక్రమణకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

మరోవైపు గ‌త నెల‌లో యూర‌ప్‌లో క‌రోనా వైర‌స్ కేసులు ఏకంగా యాభై శాతం ఎగ‌బాక‌డంతో యూర‌ప్ తిరిగి వైర‌స్ వ్యాప్తికి కేంద్రంగా మారనుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ (డ‌బ్ల్యూహెచ్ఓ) హెచ్చ‌రించింది. వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాలు అందుబాటులో ఉన్నా ప్ర‌జ‌లు పెద్ద‌సంఖ్య‌లో వ్యాక్సినేష‌న్‌కు చొర‌వ చూప‌డం లేద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ ఎమ‌ర్జ‌న్సీస్ చీఫ్ డాక్ట‌ర్ మైఖేల్ ర్యాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేయాల‌ని యూర‌ప్ అధికారులకు ఆయ‌న పిలుపు ఇచ్చారు.

కొవిడ్-19 తిరిగి త‌లెత్త‌డం ప‌ట్ల డ‌బ్ల్యూహెచ్ఓ యూర‌ప్ చీఫ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు జ‌నాభాలో 40 శాతం పైగా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసిన దేశాలు త‌మ వ్యాక్సిన్ డోసుల‌ను అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు విరాళంగా ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నం గెబ్రియ‌స‌స్ కోరారు. రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌ల‌హీనంగా ఉన్న‌వారికి మిన‌హా ఎవ్వ‌రికీ బూస్ట‌ర్ డోసులు ఇవ్వ‌రాద‌ని పిలుపు ఇచ్చారు. కొవిడ్‌-19 త‌దుప‌రి వేవ్ తలెత్త‌వ‌చ్చ‌నే ఆందోళ‌న‌తో 60కిపైగా దేశాలు బూస్ట‌ర్ డోసుల పంపిణీని ప్రారంభించిన నేప‌ధ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

First published:

Tags: Corona alert, Corona casess, Corona virus, UK Virus

ఉత్తమ కథలు