Coronavirus: మాకు వ్యాక్సిన్లు ఇస్తే.. మీకు నర్సులను ఇస్తాం.. కరోనా కాలంలో విచిత్ర ఒప్పందం..

Coronavirus: మాకు వ్యాక్సిన్లు ఇస్తే.. మీకు నర్సులను ఇస్తాం.. కరోనా కాలంలో విచిత్ర ఒప్పందం..

ప్రతీకాత్మక చిత్రం

ఫిలిప్పైన్స్‌లో మొత్తం 108 మిలియన్ల జనాభాలో రెండు వంతు (70 మిలియన్లు) మందికి రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రచారాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఈ వారంలో చైనా ఇచ్చిన మొదట విడత వ్యాక్సిన్లును అందుకోవాలని ఫిలిప్పైన్స్ ఆశిస్తోంది.

  • Share this:
ప్రస్తుతం ఆసియాలో అత్యధిక కరోనా కేసులన్న దేశం ఫిలిఫ్పైన్స్. ఫలితంగా విదేశాల నుంచి ఈ దేశానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్ల కోసం తమ దేశం నుంచి ఆరోగ్య కార్యకర్తలను అందులోనూ ముఖ్యంగా నర్సులను బ్రిటన్, జర్మనీ దేశాలకు పంపుతోంది. ఈ విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ఏడాది ఈ దేశం నుంచి 5 వేల మంది వైద్య నిపుణులను పంపుతోంది. ఈ విషయంపై అంతర్జాతీయ కార్మిక మంత్రిత్వ శాఖ వ్యవహారాల బ్యూరో డైరెక్టర్ అలిస్ విస్పెరాస్ స్పందించారు. బ్రిటన్, జర్మనీ దేశాల నుంచి ఫిలిప్పైన్స్ కరోనా వ్యాక్సిన్లను పొందనుంది. వీటికి బదులుగా ఆయా దేశాలకు తమ దేశానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలను పని చేసేందుకు పంపుతోందని ఆయన చెప్పారు.

ఫిలిప్పైన్స్‌కు చెందిన వేల మంది ఇలా వెళ్తున్నారని, అయితే ఒప్పందానికి లోబడి డిప్లాయిమెంట్ క్యాప్ ఎత్తివేయాలన్న అభ్యర్థనను కూడా తాము పరిశీలిస్తున్నట్లు విస్పేరాస్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో పనిచేసేవాళ్లలో మిలియన్ల మంది ఫిలిప్పైన్స్‌కు చెందిన నర్సులు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన లావాదేవీల్లో ఏడాదికి 30 బిలియన్ డాలర్లను వీరు అందిస్తున్నారు.

ప్రపంచంలో కరోనా మరణాల్లో బ్రిటన్ ఆరో స్థానంలో ఉంది. మహమ్మారి వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురైంది. కరోనా కేసుల్లో జర్మనీ పదో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు 23 మిలియన్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫిలిప్పైన్స్‌లో మొత్తం 108 మిలియన్ల జనాభాలో రెండు వంతు (70 మిలియన్లు) మందికి రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రచారాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఈ వారంలో చైనా ఇచ్చిన మొదట విడత వ్యాక్సిన్లును అందుకోవాలని ఫిలిప్పైన్స్ ఆశిస్తోంది. 148 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదు అందుకోవాలని ఈ దేశం కోరుకుంటోంది.

2019లో దాదాపు 17 వేల మంది ఫిలిప్పైన్స్ నర్సులు విదేశాల్లో పని ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రభుత్వ డేటా స్పష్టం చేస్తుంది. ఫిలిప్పైన్స్ నర్సులు తమ దేశంలో వేతనం తక్కువగా ఉండటం వల్ల డిప్లాయిమెంట్ నిషేధాన్ని ఎత్తివేయాలని పోరాడగా.. ప్రస్తుతం టీకా ప్రణాళిక కింద కొందరిని విదేశాలకు తరలించారు. ఈ ప్రణాళిక కొందరికైనా మంచి ఉపాధిని అందించనుంది. అయితే నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులను ప్రభుత్వం సరుకులు లేదా ఎగుమతి ఉత్పత్తులుగా పరిగణిస్తుందనే అంశం తమకు చేదు అనుభూతిని కలిగిస్తుందని ఫిలిప్పైన్స్ నర్సెస్ యునైటెడ్ సెక్రటరీ జనరల్ జోసెలిన్ అండమో రాయిటర్స్‌తో చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు